Homeremedies For Sinus: సైనస్ తో ఇబ్బందులు పడుతున్నారా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేసి చూడండి..

|

Jul 08, 2021 | 8:44 PM

Homeremedies For Sinus: ఓ వైపు కరోనా భయం నుంచి ఇంకా జనం బయటపడక ముందే.. మరోవైపు వర్షాకాలం వచ్చేసింది. తొలకరి జల్లులతో ఆహ్లాదంతో పాటు.. మేము ఉన్నామంటూ సీజనల్ వ్యాధులు..

Homeremedies For Sinus: సైనస్ తో ఇబ్బందులు పడుతున్నారా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేసి చూడండి..
Sinuses
Follow us on

Homeremedies For Sinus: ఓ వైపు కరోనా భయం నుంచి ఇంకా జనం బయటపడక ముందే.. మరోవైపు వర్షాకాలం వచ్చేసింది. తొలకరి జల్లులతో ఆహ్లాదంతో పాటు.. మేము ఉన్నామంటూ సీజనల్ వ్యాధులు వచ్చేస్తాయి. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో చాలా మందిని సైనసైటిస్ సమస్య ఇబ్బంది పెడుతుంటుంది. తరచూ ముక్కులు మూసుకుపోతూ శ్వాస తీసుకోవడం కష్టంగా మారడం సైనసైటిస్ లో కనిపించే సమస్యల్లో ప్రధానమైనది. చికిత్స తీసుకున్నా తరచుగా తిరగబెట్టే ఈ సమస్య. అయితే ఇంట్లో దొరికే పదార్ధాలతో చిట్కాలతో సైనసైటిస్ నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆ చిట్కాలు ఏమిటో చూద్దాం..

వైరస్, బాక్టీరియా, ఫంగస్ కారణంగా వచ్చే సైనస్ వ్యాధి వల్ల ముక్కుతోపాటు గొంతు సంబంధిత సమస్యలు ఏర్పడతాయి. తలనొప్పి కూడా వస్తుంది. కొన్ని రోజులపాటు పట్టి పీడించే ఈ వ్యాధి నుంచి బయటపడేందుకు చిన్న చిన్న చిట్కాలు ఎంతగానో దోహదపడతాయి.
* ఉల్లి, వెల్లుల్ని రేకులను తింటే సైనసైటిస్ బాధ తగ్గుతుంది. వంటకాల్లో ఉల్లి, వెల్లుల్లిపాయలను విరివిగా వాడితే మంచిది.
* మామిడి పండ్లు లభించే కాలంలో వాటిని బాగా తినాలి. వీటిలోని ‘ఎ’ విటమిన్‌తో మిగతా ఔషధ గుణాలు సైనసైటిస్ వంటి ఇన్‌ఫెక్షన్లను నివారిస్తాయి.
* టీ స్పూన్ జీలకర్రను వేయించి పొడిచేసి, అందులో రెండు స్పూన్ల తేనె కలిపి రోజుకు రెండు సార్లు తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. జీలకర్రను పల్చని కాటన్ వస్త్రంలో కట్టి వాసన పీల్చాలి.
*250 మిల్లీ లీటర్ల నీటిలో టీ స్పూన్ మెంతులను వేసి బాగా మరిగించి కషాయం కాయాలి. ఈ కషాయాన్ని రోజుకు నాలుగు సార్లు తీసుకోవాలి.
* 300 మిల్లీ లీటర్ల క్యారట్ రసంలో 200 మిల్లీ లీటర్ల పాలకూర రసం కలిపి రోజుకు ఒక సారి తాగాలి.
*దీర్ఘకాలంగా ఉండే సైనసైటిస్ సమస్యకు శాశ్వత పరిష్కారం లేదు.. అయితే కారం టీ సైనస్ నుంచి మంచి ఉపశమనం ఇస్తుంది. ఓ కప్పు మరిగించిన నీళ్లలో అర టీస్పూను కారం, రెండు టీస్పూన్ల తేనె, కొద్దిగా నిమ్మరసం కలిపి గోరువెచ్చగా రోజుకి రెండు సార్లు తాగితే సైనస్ నుంచి ఉపశమనం కలుగుతుందట.

Also Read: ఆషాడం బోనాలకు ముస్తాబవుతున్న ఆలయాలు.. బోనం అంటే ఏమిటి.. ఎప్పుడు మొదలయ్యాయంటే