Study on Almonds: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు తమ బరువు విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. మధ్య వయసు నుండి మొదలుకొని సీనియర్ సిటిజన్స్ దాకా చాలామంది బరువుపై శ్రద్ధ తీసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా 1.9 బిలియన్ల మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువుతో ఉన్నవారు తమ బరువును తగ్గించుకునేందుకు రకరకాల మార్గాలను అనుసరిస్తుంటారు. ఇందులో ప్రధానమైనది డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం. చాలామందికి వీటి వల్ల వచ్చే లాభనష్టాల గురించి పూర్తిగా తెలుసుకోకుండానే వీటిని తింటున్నారు. డ్రై ఫ్రూట్స్ అన్నిటిలోనూ ముఖ్యమైనది బాదం పప్పు. బాదంను తీసుకోవడం మంచిదా కాదా అనే విషయంపై రకరకాల స్టడీలు జరిగాయి. బాదంను తింటే బరువు పెరుగుతారని కొందరు చెబితే.. బరువు తగ్గుతారంటూ నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియాలో ఉన్న ఒక యూనివర్సిటీ చేసిన రీసెర్చ్ లో బాదం వల్ల బరువు తగ్గొచ్చు అని తేలింది.
అధిక బరువుతో ఉన్నవారు తీసుకుంటున్న డైట్‌లో బాదంను లేకుండా, మరికొందరు తమ డైట్‌లో బాదాంను చేర్చి తీసుకున్నారు. అసలు బాదంలో కొవ్వు కంటెంట్ ఎక్కువగా ఉంటుందని అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే బాదంను తింటే బరువు పెరుగుతారని చెప్పేవారూ ఉన్నారు. అయితే యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా స్టడీ ప్రకారం బరువు తగ్గుదలలో బాదం ఎంతో ఉపయోగపడుతుందని నిర్ధారించారు. బాదం వల్ల కేవలం బరువు తగ్గడమే కాదు కార్డియో మేటబాలిక్ ను మెరుగు పరుస్తోంది.. అంటే గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. తగిన మోతాదులో బాదం పప్పును తీసుకోవడం వల్ల 7 కేజీల బరువు తగ్గినట్టు యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా 650 బిలియన్ల మంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. ఆస్ట్రేలియాలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఓబెసిటి బారిన పడ్డారు.. అంటే సుమారు 12.5 మిలియన్ల మంది అధిక బరువుతో ఉన్నారు. యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా రీసెర్చర్ డా.శరయ్య కార్టర్ రిపోర్ట్ ప్రకారం బాదంను తీసుకోవడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. బాదంలో హైప్రోటీన్ తో పాటు ఫైబర్, మినరల్స్, విటమిన్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు కొవ్వు పదార్థం కూడా బాదంలో ఉంటుందని అంటున్నారు. అయితే ఇవి పూర్తిగా ఆరోగ్య కరమైన ఫ్యాట్ అని, వీటిని సేవించడం వల్ల బ్లడ్ కొలెస్ట్రాల్ లైవేల్స్ సైతం మెరుగు పడుతాయని తద్వారా గుండె ఆరోగ్యకరంగా ఉంటుందని ఆయన వివరించారు.
మొత్తానికి ఈ అధ్యయనంలో తేలింది ఏంటంటే..? బరువు పెరుగుతామన్న అపోహతో బాదంను దూరం పెట్టకుండా.. వీటిని మితంగా తింటే బరువు తగ్గడంతో పాటు మంచి ఆరోగ్యం మీ సొంతమవుతుంది.