
వాము - నల్ల ఉప్పు: ఈ రెండు పదార్థాలు అందరి వంటగదిలో సులభంగా లభిస్తాయి. వాటి పానీయం తయారు చేయడం కూడా చాలా సులభం. ఒక గ్లాసు నీటిలో రెండు స్పూన్ల వాము వేసి.. అర టీస్పూన్ బ్లాక్ సాల్ట్ వేసి కాస్త మరిగించాలి. ఆ తర్వాత చల్లారిన తర్వాత గొరువెచ్చిని నీటిని తాగితే ఎసిడిటీ సమస్య దూరమవుతుంది.

నిమ్మరసం - తేనె: నిమ్మకాయలో యాసిడ్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎసిడిటీ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఒక గ్లాసు నీటిలో కాస్త నిమ్మ రసం, ఒక టీస్పూన్ తేనె కలపి తాగాలి. ఈ పానీయం వల్ల ఉదర సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

జీలకర్ర నీరు: జీర్ణాశయంలోని గ్యాస్‌ను తొలగించడంలో కూడా జీలకర్ర చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. భోజనం చేసిన తర్వాత.. వేయించిన జీలకర్ర గింజలను తేలికగా చూర్ణం చేసి వాటిని ఒక గ్లాసు నీటిలో మరిగించి తాగాలి. లేదా ఒక టీస్పూన్ జీలకర్ర వేసి ఒక కప్పు నీటిలో మరిగించి తాగవచ్చు.

సోంపు వాటర్: సోంపు గింజలను.. (ఫెన్నెల్) భోజనం చేసిన తర్వాత తినడం చాలా మంచిదని పేర్కొంటారు. ఆ సోంపు గింజలను నీటిలో వేసి.. మరిగించి తాగితే.. ఉదర సమస్యలన్నీ దూరమవుతాయి. దీంతో పాటు జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.

గోరువెచ్చని పాలు: గోరువెచ్చని పాలు కూడా ఆమ్లతను తొలగించడంలో చాలా ప్రభావవంతంగా పేర్కొంటారు. రాత్రి పడుకునే ముందు గ్లాసు గోరువెచ్చని పాలను తాగితే చాలామంచిది. ఇలా కొన్ని రోజుల పాటు కంటిన్యూగా చేస్తే ఎసిడిటీ సమస్య తీరిపోతుంది.