AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes: షుగర్‌ పేషెంట్స్‌ మద్యం తాగితే ఏమవుతుందో తెలుసా.? పొరపాటున కూడా..

డయాబెటిస్‌తో బాధపడే వారు ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పూర్తిగా డైట్‌ను మెయింటెన్‌ చేస్తే కానీ ఈ వ్యాధి తాలుకూ సైడ్‌ ఎఫెక్ట్స్‌ పెద్దగా ప్రభావం చూపవు. అందుకే డయాబెటిస్‌ వచ్చిందని తెలియగానే పూర్తిగా డైట్‌ను మార్చేస్తుంటారు. తీసుకునే ఆహారం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉంటారు. ఇలాంటి డయాబెటిస్‌ బాధితులు మద్యం తీసుకుంటే...

Diabetes: షుగర్‌ పేషెంట్స్‌ మద్యం తాగితే ఏమవుతుందో తెలుసా.? పొరపాటున కూడా..
Diabetes And Alcohol
Narender Vaitla
|

Updated on: Sep 23, 2023 | 10:40 AM

Share

నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎక్కువగా ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక వ్యాధుల్లో డయాబెటిస్‌ ఒకటి. రోజురోజుకీ షుగర్‌ వ్యాధి బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా భారత్‌లో డయాబెటిస్‌ బాధితుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దేశంలో సుమారు 10.01 కోట్ల మంది డయాబెటిస్‌తో బాధపడుతున్నట్లు తేలింది. ఇక ప్రీ డయాబెటిక్‌ రోగుల సంఖ్య దాదాపు 15 కోట్ల వరకు ఉండొచ్చన్న అంచనా ఆందోళన కలిగిస్తోంది.

డయాబెటిస్‌తో బాధపడే వారు ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పూర్తిగా డైట్‌ను మెయింటెన్‌ చేస్తే కానీ ఈ వ్యాధి తాలుకూ సైడ్‌ ఎఫెక్ట్స్‌ పెద్దగా ప్రభావం చూపవు. అందుకే డయాబెటిస్‌ వచ్చిందని తెలియగానే పూర్తిగా డైట్‌ను మార్చేస్తుంటారు. తీసుకునే ఆహారం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉంటారు. ఇలాంటి డయాబెటిస్‌ బాధితులు మద్యం తీసుకుంటే ఎంతటి ప్రమాదమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే కొందరు డయాబెటిస్‌ రోగులు మద్యం తీసుకుంటుంటారు.

మాములు వ్యక్తులు ఆల్కహాల్‌ తీసుకుంటేనే ఆరోగ్యానికి హానికరమైతే షుగర్‌ పేషెంట్స్‌ తీసుకుంటే మరిన్ని దుష్ఫ్రభావాలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా డయాబెటిస్‌ వచ్చిన వారిలో కాళ్లు, చేతుల్లో మంట రావడం గమనిస్తుంటాం. అయితే ఇలాంటి వాళ్లు మద్యం తీసుకుంటే ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుందని నిపుణులు హెచ్చిరిస్తున్నారు. ఇక మద్యం సేవించిన తర్వాత చాలా మంది రాత్రుళ్లు తినకుండానే పడుకుంటారు. ఇది మరింత ప్రమాదకరమని చెబుతున్నారు. ఇది శరీరంలో కాలేయ పనితీరును పాడు చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇక షుగర్‌తో బాధపడే వారు ప్రతీరోజూ కచ్చితంగా ట్యాబ్లెట్స్‌ వేసుకోవాలనే విషయం తెలిసిందే. అయితే మద్యం సేవించిన తర్వాత ట్యాబ్లెట్స్‌ తీసుకుంటే కడుపులో మంట, వాంతులు కావడం వంటివి జరుగుతాయని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో రక్తపు వాంతులు కూడా అయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అందుకే మదుమేహంతో బాధపడేవారు ఆల్కహాల్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కాలేయ పనితీరు దెబ్బ తినడం వల్ల గ్లూకోజ్‌ స్థాయిలో తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. కాలేయంపై దుష్ఫ్రభావం చూపే ఆల్కహాల్‌ను వదిలేస్తే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు.

మధుమేహంతో బాధపడేవారు లైఫ్‌ స్టైల్‌లో కొన్ని మార్పులు తీసుకురావడం ద్వారా వ్యాధి నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తీసుకునే ఆహారంలో తృణ ధాన్యాలు, తాజా కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. ఒకేసారి ఎక్కువ తినడం కంటే ఎక్కువసార్లు తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల శరీరంలో చక్కెర స్థాయిలో కంట్రోల్‌లో ఉండేలా చూసుకోవచ్చు. అలాగే రోజూ సరిపడ నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు. రోజులో కనీసం 3 లీటర్ల నీటిని తాగాలని చెబుతున్నారు.

మరిన్ని హెల్త్ కథనాల కోసం క్లిక్ చేయండి..

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!