
ఆహారపు అలవాట్లు, అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా.. నేడు చాలా మంది మధుమేహ బాధితులుగా మారుతున్నారు. మధుమేహం శరీరంలో అధిక రక్తంలో చక్కెర స్థాయిలకు కారణమవుతుంది. రక్తంలో చక్కెరను నియంత్రించడానికి, ప్రజలు మందులు తీసుకోవచ్చు.. ఇంకా ఆహారంలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే.. మధుమేహం దీర్ఘకాలిక వ్యాధి కావున.. దీని విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.. రక్తంలో చక్కెరను నియంత్రించడానికి మీరు యాలకుల నీటిని కూడా తాగవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.. యాలకులు తినడం లేదా యాలకుల నీటని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
సుగంధ ద్రవ్యాలు యాలకులలో ఎన్నో పోషకాలతోపాటు.. ఔషధ గుణాలు దాగున్నాయి.. యాలకులు ఆహార రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటాయి. యాలకులు తీసుకోవడం మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది. యాలకులు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.
యాలకులలో పీచు పదార్థం, విటమిన్లు, మాంగనీస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. తక్కువ కేలరీలు, కార్బోహైడ్రేట్లు కలిగిన యాలకులు జీర్ణక్రియను మెరుగుపరచడం, రక్తపోటును అదుపు చేయడం, నోటి దుర్వాసనను తగ్గించడం, యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. యాలకులు చాలా తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి.. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
యాలకులు తినడం వల్ల లేదా యాలకుల నీటిని తాగడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి.. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు యాలకుల ప్రయోజనాలను పెంచడానికి.. నేరుగా తినవచ్చు లేదా నీటిని తాగవచ్చు..
యాలకుల నీటిని తయారు చేసుకుని.. టీ లాగానే తాగవచ్చు. ముందుగా ఒక కప్పు నీటిని వేడి చేసి. దానికి ఏలకులు, అల్లం వేసి మరిగించాలి. ఆ తర్వాత వడకట్టి త్రాగాలి. ఈ టీని రోజూ తాగడం వల్ల మీ చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే.. ఆరోగ్య నిపుణులను సంప్రదించండి..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..