Men Health: మగ మహారాజులకు వరం యాలకులు.. రోజూ రెండు తింటే అదిరిపోయే బెనిఫిట్స్.. ఇంకా ఆ పనిలో..

మసాలా దినుసు యాలకుల్లో ఔషధ గుణాలతోపాటు ఎన్నో పోషకాలు దాగున్నాయి. ఇవి ఆహార రుచిని పెంచడంతోపాటు మంచి సువాసనను కలిగి ఉంటాయి.

Men Health: మగ మహారాజులకు వరం యాలకులు.. రోజూ రెండు తింటే అదిరిపోయే బెనిఫిట్స్.. ఇంకా ఆ పనిలో..
Cardamom

Updated on: Sep 09, 2022 | 1:40 PM

Cardamom benefits for Men: మసాలా దినుసు యాలకుల్లో ఔషధ గుణాలతోపాటు ఎన్నో పోషకాలు దాగున్నాయి. ఇవి ఆహార రుచిని పెంచడంతోపాటు మంచి సువాసనను కలిగి ఉంటాయి. అయితే.. వీటిని రెగ్యులర్‌గా తింటే.. మన శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతోపాటు పలు అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని సూచిస్తున్నారు. ఏలకులను చాలామంది మౌత్ ఫ్రెష్‌నర్‌గా తింటారు. వీటిని నమలడం వల్ల మన నోరు మొత్తం పూర్తిగా తాజాగా మారుతుంది. యాలకులలో విటమిన్ B6, విటమిన్ B3, విటమిన్ C, జింక్, కాల్షియం, పొటాషియం అలాగే ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్నాయి. నోటి దుర్వాసనకు కారణమయ్యే జెర్మ్స్‌తో పోరాడడంలో యాలకులు సహాయపడతాయి. దీంతో దంతాలను కూడా శుభ్రపరుస్తాయి. రోజుకు రెండు, మూడు యాలకులు తింటే చాలామంచిదని నిపుణులు పేర్కొంటున్నారు.

యాలకులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..

  1. గుండె ఆరోగ్యంగా ఉంచుతాయి: యాలకులు రోజూ తీసుకుంటే గుండెను పూర్తిగా ఆరోగ్యంగా ఉంచుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు దూరమవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. గుండెపోటు, పలు సమస్యలను నివారించడానికి మీరు రెండు లేదా మూడు ఏలకులను తినవచ్చు.
  2. రక్తపోటు: అధిక రక్తపోటు, ఉబ్బసం, అజీర్ణం వంటి అనేక వ్యాధులకు యాలకులు అద్భుతమైన ఔషధం. యాలకులలో ఉండే యాంటీఆక్సిడెంట్లు జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.
  3. ఇవి కూడా చదవండి
  4. లైంగిక జీవితాన్ని మెరుగుపరుస్తాయి: యాలకులు పురుషులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇవి పురుషుల జీవితంలో కొత్త తాజాదనాన్ని తీసుకువస్తాయని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. దీని వల్ల సెక్స్ పట్ల కోరిక పెరిగి భాగస్వామికి చాలా దగ్గరవుతారు. అందువల్ల పురుషులు తమ లైంగిక జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రతిరోజూ యాలకులను తీసుకుంటే మంచిదంటున్నారు.
  5. కాలేయ వ్యాధులను దూరం చేస్తాయి: యాలకులు ఫ్యాటీ లివర్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కాలేయం, బరువు పెరుగుటాన్ని నివారించడంలో యాలకులు సహాయపడతాయి. ఎలివేటెడ్ లివర్ ఎంజైమ్‌లు, ట్రైగ్లిజరైడ్, చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో, ఫ్యాటి లివర్ ప్రమాదాన్ని నివారించడంలో సహాయపడతాయి.
  6. వ్యర్థాలను తొలగిస్తాయి: యాలకులు కిడ్నీల ద్వారా వ్యర్థ పదార్థాలను తొలగిస్తాయి. శరీరంలో పేరుకుపోయిన కాల్షియం, యూరియా, టాక్సిన్‌లను తొలగించి.. మూత్రశాయాన్ని డిటాక్స్ చేస్తాయి.
  7. బెల్లీ ఫ్యాట్‌: పొట్టకు యాలకులు చాలా మేలు చేస్తాయి. పొట్టలో నిల్వ ఉన్న కొవ్వును తగ్గించడంలో యాలకులు సహకరిస్తాయి.
  8. నోటి దుర్వాసనను తగ్గిస్తుంది: యాలకులు నోటి దుర్వాసనకు కారణమయ్యే సూక్ష్మక్రిములను నాశనం చేయడంతో పాటు దంతాలను శుభ్రపరచడంలో సహాయపడతాయి.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం

Loading...
Unable to load recommendations.
Follow Us