బీట్‌రూట్ తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి. బీట్‌రూట్ శాస్త్రీయ నామం బేట వల్గురీస్. దీనిని రోజూ తీసుకుంటే రక్తహీనత సమస్య తగ్గుతుంది. అలాగే గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా ఒత్తిడిని తగ్గించడంలోనూ బీట్‌రూట్ మెరుగ్గా పనిచేస్తుంది. ఇందులో పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ బి6 వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. రక్తహీనత సమస్యతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ బీట్‌రూట్ తినాలి.
కంటి చూపు సమస్యలను తగ్గించడంలోనూ బీట్‌రూట్ సహాయపడుతుంది. బీట్‌రూట్‌కు ఎరుపు రంగుని కలిగించే బీటాసైయానిన్‌కు పేద్దపేగుల్లో క్యాన్సర్‌తో పోరాడే లక్షణం ఉంది. అనీమియాతో బాధపడేవారు రోజూ ఒక కప్పు బీట్‌రూట్ రసం తాగితే త్వరగా సమస్య నుంచి బయటపడతారు. అయితే ఎన్నో ప్రయోజనాలు అందించే బీట్‌రూట్ కొన్నిసార్లు ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది. కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు బీట్‌రూట్ తీసుకోవడం వలన హానికరంగా మారుతుంది.
బీట్‌రూట్ తినడం వలన రక్తపోటు ఉన్నవారికి ప్రమాదం. బీట్‌రూట్ తినడం వలన రక్తపోటు మరింత తగ్గుతుంది. ఈ అనారోగ్య సమస్య ఉన్నవారు బీట్‌రూట్ తినకూడదు. అలాగే కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు కూడా బీట్‌రూట్ తీసుకోవద్దు. గాల్ బ్లాడర్, కిడ్నీలో రాళ్లు ఉన్నవారు బీట్‌రూట్ తినకూడదు. ఇందులో ఆక్సలేట్ ఎక్కువగా ఉంటుంది. దీంతో కిడ్నీలో రాళ్ల సమస్య మరింత పెరుగుతుంది.
అలెర్జీ, చర్మం పై దద్దుర్లు వంటి సమస్యలు ఉన్నవారు బీట్‌రూట్ తినకూడదు. ఇది అలెర్జీలు, చర్మంపై దద్దుర్ల సమస్యను మరింత పెంచుతుంది. అలాగే మధుమేహ రోగులు కూడా బీట్‌రూట్ తినకూడదు. డయబెటిక్ సమస్యను మరింత పెంచుతుంది. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది.
Also Read: AR Rahman: నా కూతుర్లకు నేను ఇచ్చే సలహా అదే.. ఆసక్తికర కామెంట్స్ చేసిన ఏఆర్ రెహమాన్..
Sudigali Sudheer: జబర్దస్త్ను వీడనున్న సుడిగాలి సుధీర్ టీం.. స్జేట్ పైనే ఎమోషనల్ కామెంట్స్..