ఆరోగ్యం పేరుతో ప్రస్తుత కాలంలో చాలామంది గ్రీన్ టీకి అలవాటు పడ్డారు. గ్రీన్ టీ తాగితే బరువు తగ్గుతారని.. ఫిట్‌గా ఉంటారని.. అలాగే ఆరోగ్యంగా ఉండొచ్చని రకరకాలుగా గ్రీన్ టీని అలవాటుగా మార్చుకుంటున్నారు. గ్రీన్ టీ తయారీ కోసం ప్రాసెస్ చేయరు. పైగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయని భావించి చాలా మంది ఇప్పుడు గ్రీన్ టీనే ఎక్కువగా తాగేస్తున్నారు. బరువు తగ్గాలనే లక్ష్యంతో చాలామంది గ్రీన్ టీపై ఆధారపడుతున్నారు. ఉదయం లేవగానే, సాయంత్రం సమయంలో గ్రీన్ టీని ఎక్కువగా తీసుకుంటున్నారు.
గ్రీన్ టీ అలవాటు మీ శరీరంలో ఉన్న కొవ్వును కరిగిస్తుంది. కానీ ఉదయం వ్యాయామం చేసే 30 నిమిషాల ముందు ఈ గ్రీన్ టీని తాగితే వ్యాయామం చేసే సమయంలో ఇది ఇంధనంగా పనిచేసి త్వరగా మీ శరీరంలో ఉన్న కొవ్వుని కరిగిస్తుంది.అయితే, ఆరోగ్యానికి మేలు చేస్తుందని భావిస్తున్న గ్రీన్ టీ సారంతో కాలేయానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
ఎక్కువ మోతాదులో ఎక్కువ కాలం ఆ సారాన్ని తీసుకొంటే లివర్ దెబ్బతినే అవకాశం ఉన్నదని అమెరికాలోని రుట్గర్స్ స్కూల్ ఆఫ్ హెల్త్ ప్రొఫెషన్స్ పరిశోధకులు వెల్లడించారు. గ్రీన్ టీ సారంతో క్యాన్సర్, హృద్రోగాలు, ఊబకాయం, మధుమేహం తగ్గుతుందని పలు అధ్యయానాల్లో తేలినా, తాము పరీక్షించిన కొంతమందిలో కాలేయం పాడైందని వివరించారు.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి