జిమ్‌లు తెరిచేందుకు అనుమతివ్వండి‌.. ఎంపీలో నిరసన ప్రదర్శనలు..

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. కరోనా కట్టడి కోసం.. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా మార్చి నెల నుంచి లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దశల వారీగా లాక్‌డౌన్ సడలింపులు..

జిమ్‌లు తెరిచేందుకు అనుమతివ్వండి‌.. ఎంపీలో నిరసన ప్రదర్శనలు..
Follow us

| Edited By:

Updated on: Jul 09, 2020 | 3:48 PM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. కరోనా కట్టడి కోసం.. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా మార్చి నెల నుంచి లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దశల వారీగా లాక్‌డౌన్ సడలింపులు చేస్తూ వస్తోంది. గత మే నెల చివరి నుంచి క్రమక్రమంగా అన్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే దశల వారీగా ఒక్కదానిపై నిషేధాన్ని ఎత్తివేస్తూ వస్తోంది ప్రభుత్వం. అయితే ఇప్పటి వరకు అనేక రాష్ట్రాల్లో జనసంచారం ఉన్న వాటికి ఇప్పటి వరకు అనుమతులు ఇవ్వలేదు. అందులో వ్యాయమ శాలలు (జిమ్‌లు) కూడా ఉన్నాయి. దీంతో జిమ్ నిర్వాహకులతో పాటు.. ఫిట్‌నెస్ ట్రైనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత మూడు నెలలుగా తమకు ఉపాధి లేకుండా పోయిందని వాపోతున్నారు. ఆర్ధికంగా కూడా తాము తీవ్ర కష్టాల్లో ఉన్నామంటున్నారు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జిమ్‌ ఓనర్స్‌తో పాటు.. ఫిట్‌నెస్ ట్రైనర్లు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. లాక్‌డౌన్‌లో కూడా తాము అద్దెకు తీసుకుని నడుపుతున్న జిమ్ సెంటర్లు, ఫిట్‌నెస్ సెంటర్లకు అద్దెలు చెల్లించామని.. ఇప్పుడు పరిస్థితి చాలా కష్టంగా ఉందన్నారు. ఇప్పటికైనా జిమ్‌లను ఓపెన్‌ చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చి తమను ఆదుకోవాలని జిమ్ నిర్వాహకులు వేడుకుంటున్నారు.