నేటికి 30 ఏళ్లు పూర్తి చేసుకున్న వ‌ర‌ల్డ్ వైడ్ వెబ్

వరల్డ్ వైడ్ వెబ్ (సాధారణంగా “వెబ్ “గా పిలవబడే) ఇంటర్నెట్ ద్వారా కలపబడి ఉన్న హైపర్ టెక్స్ట్ పత్రాల వ్యవస్థ.వెబ్ బ్రౌజరు సహాయంతో మనము వెబ్ పేజిలలో గల అక్షరాలు, చిత్రాలు, చలనచిత్రాలు మరియు ఇతర మల్టిమీడియాను చూడవచ్చు మరియు హైపర్ లింకుల సహాయంతో వాటిమధ్య కదలవచ్చు. అయితే ఈ వ‌ర‌ల్డ్ వైడ్ వెబ్ సేవ‌లు ప్రారంభ‌మై సరిగ్గా నేటికి 30 సంవ‌త్సరాలు విజ‌య‌వంతంగా పూర్తయ్యాయి. అందుక‌నే సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ త‌న సెర్చ్ సైట్‌లో […]

నేటికి 30 ఏళ్లు పూర్తి చేసుకున్న వ‌ర‌ల్డ్ వైడ్ వెబ్
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 1:36 PM

వరల్డ్ వైడ్ వెబ్ (సాధారణంగా “వెబ్ “గా పిలవబడే) ఇంటర్నెట్ ద్వారా కలపబడి ఉన్న హైపర్ టెక్స్ట్ పత్రాల వ్యవస్థ.వెబ్ బ్రౌజరు సహాయంతో మనము వెబ్ పేజిలలో గల అక్షరాలు, చిత్రాలు, చలనచిత్రాలు మరియు ఇతర మల్టిమీడియాను చూడవచ్చు మరియు హైపర్ లింకుల సహాయంతో వాటిమధ్య కదలవచ్చు. అయితే ఈ వ‌ర‌ల్డ్ వైడ్ వెబ్ సేవ‌లు ప్రారంభ‌మై సరిగ్గా నేటికి 30 సంవ‌త్సరాలు విజ‌య‌వంతంగా పూర్తయ్యాయి. అందుక‌నే సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ త‌న సెర్చ్ సైట్‌లో వ‌ర‌ల్డ్ వైడ్ వెబ్ కు చెందిన డూడుల్‌ను ఇవాళ ఉంచింది. 1989వ సంవ‌త్సరం మార్చి 12వ తేదీన టిమ్ బెర్నర్స్ లీ మొద‌టి సారిగా వ‌ర‌ల్డ్ వైడ్ వెబ్ ను అభివృద్ధి చేశారు. ఆ తరువాత 1993 ఏప్రిల్ నెల నుంచి వ‌ర‌ల్డ్ వైడ్ వెబ్ సేవ‌లు ప్రజ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చాయి. ఈ క్రమంలో టిమ్ బెర్నర్స్ లీ వ‌ర‌ల్డ్ వైబ్ వెబ్‌కు 30 ఏళ్లు పూర్తయిన సంద‌ర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఇంట‌ర్నెట్ యూజ‌ర్ త‌న డేటాను సుర‌క్షితంగా ఉంచుకోవాల‌ని అన్నారు. అలాగే నెట్‌లో వ‌చ్చే త‌ప్పుడు వార్తల ప‌ట్ల అప్రమ‌త్తంగా ఉండాల‌ని, దేన్నీ అంత తేలిగ్గా న‌మ్మవ‌ద్దని, మోస‌పోవ‌ద్దని హెచ్చరించారు.