ప్రపంచంలో బెస్ట్ ఫీల్డర్ అతడే అంటోన్న గంభీర్…

భార‌త స్టార్ ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజాపై, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించాడు. ప్రపంచంలోని అత్యుత్తమ ఫీల్డర్​ జ‌డ్డూనే అని తేల్చి చెప్పాడు గంభీర్. చేతికి చిక్కిన బంతిని విసరడంలో జడేజా కన్నా గొప్పవాళ్లు ఎవ‌రూ లేర‌ని అభిప్రాయ‌‌ప‌డ్డాడు.

ప్రపంచంలో బెస్ట్ ఫీల్డర్ అతడే అంటోన్న గంభీర్...
Gautam Gambhir
Follow us

|

Updated on: Jun 20, 2020 | 2:35 PM

భార‌త స్టార్ ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజాపై, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించాడు. ప్రపంచంలోని అత్యుత్తమ ఫీల్డర్​ జ‌డ్డూనే అని తేల్చి చెప్పాడు. చేతికి చిక్కిన బంతిని విసరడంలో జడేజా కన్నా గొప్పవాళ్లు ఎవ‌రూ లేర‌ని అభిప్రాయ‌‌ప‌డ్డాడు.

“వ‌ర‌ల్డ్ క్రికెట్​లో ర‌వీంద్ర‌ జడేజా కంటే గొప్ప ఫీల్డర్ లేడని నాక‌నిపిస్తుంది. ఔట్​ఫీల్డ్​లో అతడుంటే కొండ‌త అండ ఉన్న‌ట్టే. అక్క‌డే కాదు పాయింట్ లేదా కవర్​లో అయినా సరే జడ్డూ త‌న మార్క్ చూపిస్తాడు. క్యాచులు అందుకోవ‌డంలోనూ అత‌డే దిట్ట” అని గౌత‌మ్ గంభీర్ పేర్కొన్నాడు.

గంగూలీ సార‌థిగా వ్య‌వ‌హ‌రించిన‌ప్ప‌టి నుంచి భార‌త‌ బ్యాటింగ్, బౌలింగ్​తో పాటు ఫీల్డింగ్ ప్రమాణాలు చాలా మెరుగ‌య్యాయి. కైఫ్, యువరాజ్ సింగ్, రైనా​ లాంటి ఫీల్డర్లు అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేశారు. ఆ తర్వాత కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ లాంటి వారు ఆ లెగసీని నిల‌బెడుతూ ఫీల్డింగ్​లో సత్తాచాటుతున్నారు.