ఫ్యాన్సీ నంబర్ పేరుతో.. లక్షల్లో మోసం..

సైబర్ నేరగాళ్లకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. రోజుకో కొత్త పథకంతో అమాయకులను మోసం చేసి పెద్ద మొత్తంలో దండుకుంటున్నారు. తాజాగా మరో సైబర్ నేరం వెలుగులోకి వచ్చింది. ఫ్యాన్సీ మొబైల్ నంబర్లు ఇప్పిస్తామంటూ ఓ వ్యాపారిని మోసం చేశారు సైబర్ నేరగాళ్లు. హైదరాబాద్‌లోని ఆదర్శ్ నగర్ కాలనీకి చెందిన ఓ వ్యాపారి మొబైల్‌కి మీకు ఫ్యాన్సీ నంబర్ ఇస్తామంటూ మెసేజ్ వచ్చింది. మెసేజ్ చూసిన వ్యాపారి ఆ నంబర్‌కు కాల్ చేశాడు. మూడు ఫ్యాన్సీ నంబర్లు […]

ఫ్యాన్సీ నంబర్ పేరుతో.. లక్షల్లో మోసం..
Follow us

| Edited By:

Updated on: Aug 15, 2019 | 12:09 PM

సైబర్ నేరగాళ్లకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. రోజుకో కొత్త పథకంతో అమాయకులను మోసం చేసి పెద్ద మొత్తంలో దండుకుంటున్నారు. తాజాగా మరో సైబర్ నేరం వెలుగులోకి వచ్చింది. ఫ్యాన్సీ మొబైల్ నంబర్లు ఇప్పిస్తామంటూ ఓ వ్యాపారిని మోసం చేశారు సైబర్ నేరగాళ్లు. హైదరాబాద్‌లోని ఆదర్శ్ నగర్ కాలనీకి చెందిన ఓ వ్యాపారి మొబైల్‌కి మీకు ఫ్యాన్సీ నంబర్ ఇస్తామంటూ మెసేజ్ వచ్చింది. మెసేజ్ చూసిన వ్యాపారి ఆ నంబర్‌కు కాల్ చేశాడు. మూడు ఫ్యాన్సీ నంబర్లు కావాలని కోరాడు. ఒక్కో నంబర్‌కు లక్ష రూపాయలు ఖర్చవుతుందని చెప్పారు. అయితే నంబర్‌తో పాటు ఓ ఐఫోన్ ఎక్స్‌ను కూడా బహుమతిగా ఇస్తామని వ్యాపారిని నమ్మించారు. తాము చెప్పే బ్యాంక్ అకౌంట్‌లో జమ చేయాలని చెప్పారు. దీంతో వారి మాటలు నమ్మిన వ్యాపారి అక్షరాల మూడు లక్షల రూపాయలు పంపించాడు. కొద్ది రోజులు ఎదురుచూసినా.. సిమ్ కార్డులు రాకపోవడంతో వారికి ఫోన్ చేశాడు. ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. విచారణ చేపట్టిన పోలీసులు మహారాష్ట్రలోని నాసిక్ కు చెందిన ఓ గ్యాంగ్ ఈ మోసానికి పాల్పడినట్లు తేల్చారు. నాసిక్ పోలీసుల సహాయంలో ఆ గ్యాంగ్ లోని నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై మరింత విచారణ జరిపి పూర్తి వివరాలు సేకరిస్తామని డీసీపీ రఘువీర్ తెలిపారు.