Breaking News
  • ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని మార్చే హక్కు ఎవరికీ లేదు. సుప్రీంకోర్టు, రాష్ట్రపతి ఒప్పుకుంటేనే హైకోర్టు కదులుతుంది-కేశినేని. అమరావతి రక్షణకు పార్లమెంటు వేదికగా పోరాటం చేస్తాం-కేశినేని.
  • చిత్తూరు: తిరుచానూరు పీఎస్‌ నుంచి బేడీలతో పరారైన దొంగ. ట్రాక్టర్‌ దొంగతనం కేసులో నాగరాజును అరెస్ట్‌చేసిన పోలీసులు. దొంగ నాగరాజు కోసం గాలిస్తున్న పోలీసులు.
  • ఢిల్లీ: ఆప్‌ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు. నిర్భయ దోషులను రక్షించేందుకు ఆప్‌ ప్రభుత్వం యత్నిస్తోంది. కావాలనే న్యాయ ప్రక్రియను ఆలస్యం చేస్తోంది-మనోజ్‌ తివారీ. పోలీసులు తమ పరిధిలో లేరని తప్పించుకోవాలని ఆప్‌ చూస్తోంది -బీజేపీ ఢిల్లీ చీఫ్‌ మనోజ్‌ తివారీ.
  • అనంతపురం: తాడిపత్రిలో కత్తిపోట్లు. డబ్బుల విషయంలో స్నేహితుల మధ్య ఘర్షణ. రాము అనే వ్యక్తిని కత్తితో పొడిచిన రవితేజ. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిన రాము.
  • రైతులు కన్నీళ్లు పెట్టినా సీఎం మనసు కరగడం లేదు. రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం నడుస్తోంది-దేవినేని ఉమ. విశాఖలో భూదందా నడుస్తోంది-మాజీ మంత్రి దేవినేని ఉమ. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం రాజధానిని విశాఖకు తరలిస్తున్నారు. పులివెందుల పులి డమ్మీ కాన్వాయ్‌తో వెళ్తోంది. దేశ చరిత్రలో డమ్మీ కాన్వాయ్‌తో వెళ్లిన సీఎం చరిత్రలో లేరు. సచివాలయానికి వెళ్లేందుకు మెటల్‌ రోడ్డు వేసుకుంటున్నారు. 5 కోట్ల మంది ప్రజలు రేపు రోడ్లపైకి రావాలి-దేవినేని ఉమ.

పండుగపూట విషాదం..రావులపాలెం వద్ద యాక్సిడెంట్‌లో నలుగురి మృతి

four killed in a road accident in ravulapalem, పండుగపూట విషాదం..రావులపాలెం వద్ద యాక్సిడెంట్‌లో నలుగురి మృతి

ఈస్ట్ గోదావరి జిల్లా రావులపాలెం వద్ద పండుగ రోజు దారుణ రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీకొనడంతో..నలుగురు స్పాట్‌లో ప్రాణాలు కొల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు కారులో ఇరుక్కుపోవడంతో అతి కష్టంమీద వారిని బయటకు తీసి దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. చనిపోయినవారు విజయవాడకు చెందిన వారిగా సమాచారం అందుతోంది. వీరంతా పండక్కు పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతం బంధువుల ఇంటికి వచ్చారని తెలుస్తోంది.  మూవీ చూడటానికి రావులపాలెం రాగా రిటన్ జర్నీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.యాక్సిడెంట్‌ వల్ల రోడ్డు పూర్తి బ్లాక్ అయ్యింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.

ప్రమాదంలో కార్లు రెండు తునాతనరకలైపోయాయి. వాటి ఫోటోలను చూస్తేనే ప్రమాద తీవ్రత ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. విజయవాడ వైపు వెళ్తోన్న కారు ఓవర్ స్పీడ్‌తో డివైడర్ దాటి వచ్చి మరోవైపు వెళ్తున్న కారును ఢీకుంది. కాగా ప్రమాద కారణమైన కారులో ఉన్న వ్యక్తి మద్యం మత్తులో డ్రైవింగ్ చేసి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.