పేర్లు మారనున్న వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌.. సేవలు మాత్రం సేమ్..

ప్రముఖ సామాజిక మాధ్యమాలైన వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్‌ ఆప్లికేషన్ల పేర్లు మారనున్నాయట. ఈ నిర్ణయం వీటి మాతృ సంస్థ ఫేస్‌బుక్ తీసుకుంది.ఈ రెండు యాప్‌లు ఫేస్‌బుక్ నుంచి వచ్చినప్పటికీ వీటికంటూ స్వతంత్రత ఉంది. గత ఏడాది కాలంగా ఫేస్‌బుక్‌ వీటికి ఆ స్వతంత్రతను తగ్గిస్తూ వస్తోంది. ఇప్పుడు ఏకంగా వాటి పేర్లు మార్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌ 2012లో ప్రారంభించగా, వాట్సప్‌ 2014లో వినియోగంలోకి వచ్చింది.

కాగా, ఈ రెండింటికీ సొంత మేనేజర్లు, ఉద్యోగులు, విడివిడి కార్యాలయాలు కూడా ఉన్నాయి. అయితే గత కొన్నాళ్లుగా ఫేస్‌బుక్‌ తమ సంస్థలో కొన్ని కొత్త మార్పులు తెచ్చింది. వీటిలో భాగంగా వీటికి స్వతంత్రతకు కత్తెర వేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ పేర్లను మారుస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఇకపై వాట్సప్‌ పేరును వాట్సప్‌ ఫ్రమ్‌ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ ఫ్రమ్‌ ఫేస్‌బుక్‌ అని మార్చనుంది. అంతేకాదు గూగుల్ ప్లేస్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌లో ఈ పేర్లతోనే ఈ రెండు యాప్‌లు కనిపించబోతున్నాయి. లాగిన్‌ పేజీల్లోనూ ఇదే పేరు కనపడనుంది.

అంతేకాదు.. గత ఐదేళ్లలో వాట్సప్‌, ఇన్‌స్టాలలో ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చింది. వినియోగదారులను ఆకర్షించేందుకు ఎన్నో న్యూ ఫీచర్స్‌ను తీసుకొచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *