ఎగ్జిట్ పోల్స్‌‌పై చంద్రబాబు రియాక్షన్

Chandrababu Reaction over exit polls, ఎగ్జిట్ పోల్స్‌‌పై చంద్రబాబు రియాక్షన్

దేశవ్యాప్తంగా బీజేపీ హవా మరోసారి కొనసాగుతుందని, మోదీ మళ్లీ పీఎం అవుతారంటూ అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెబుతున్నాయి. అలాగే ఏపీలో నేషనల్ సర్వేలు చాలా వరకు జగన్ వైపే మొగ్గు చూపాయి.  ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎగ్జిట్ పోల్స్‌పై స్పందించారు. ప్రజల నాడి పట్టుకోవడంలో ఎగ్జిట్ పోల్స్ విఫలం అయ్యాయని చంద్రబాబు అన్నారు.

‘ప్రజల నాడి పట్టుకోవడంలో ఎగ్జిట్ పోల్స్ చాలా సార్లు విఫలం అయ్యాయి. వాస్తవ పరిస్థితికి దూరంగా, భిన్నంగా ఎగ్జిట్ పోల్స్ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే, ఎలాంటి అనుమానం లేకుండా ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. కేంద్రంలో కూడా బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని నమ్మకంతో ఉన్నాం.’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు. మరోవైపు ఫలితాల్లో 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కబెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. దీనిపై తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ఎన్నికల ఫలితాలు మొదలవ్వకముందే ఐదు అసెంబ్లీ పోలింగ్ బూత్‌ల్లోని వీవీప్యాట్ స్లిప్పులను లెక్క బెట్టాలని, అలా కాకుండా మరోలా వ్యవహరిస్తే అన్ని అసెంబ్లీల్లో మొత్తం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాల్సి ఉంటుందని చంద్రబాబు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *