బిగ్ బాస్: ఎలిమినేషన్‌లో ‘ఆ నలుగురు’.. డేంజర్ జోన్‌లో ‘ఆమె’!

అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 చివరి అంకంకు చేరుకుంది. మరో నాలుగు వారాల్లో షో ముగియనుంది. హౌస్‌లో అందరూ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్లే ఉండటంతో రోజుకో ట్విస్ట్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తున్నాడు బిగ్ బాస్. ఇకపోతే ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన ‘రాళ్లే రత్నాలు’ టాస్క్‌లో రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి, వరుణ్ సందేశ్, మహేష్ విట్టా‌లు ఓడిపోవడంతో వారు ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు. అనూహ్యంగా ఈ వారం ఎలిమినేషన్స్‌లోకి ప్రేమ […]

బిగ్ బాస్: ఎలిమినేషన్‌లో 'ఆ నలుగురు'.. డేంజర్ జోన్‌లో 'ఆమె'!
Ravi Kiran

|

Oct 03, 2019 | 4:47 PM

అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 చివరి అంకంకు చేరుకుంది. మరో నాలుగు వారాల్లో షో ముగియనుంది. హౌస్‌లో అందరూ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్లే ఉండటంతో రోజుకో ట్విస్ట్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తున్నాడు బిగ్ బాస్. ఇకపోతే ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన ‘రాళ్లే రత్నాలు’ టాస్క్‌లో రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి, వరుణ్ సందేశ్, మహేష్ విట్టా‌లు ఓడిపోవడంతో వారు ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు. అనూహ్యంగా ఈ వారం ఎలిమినేషన్స్‌లోకి ప్రేమ జంట రావడంతో ఎవరు హౌస్ నుంచి బయటికి వెళ్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.

వరుణ్ సందేశ్ హౌస్‌లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్లలో ఒకరు. మొదట్లో గొడవలు పడినా.. ఆ తర్వాత నెమ్మదించి మిస్టర్ పర్ఫెక్ట్‌గా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. కాబట్టి వరుణ్‌ ఎలాగో సేఫ్ అయినట్లే. అటు మహేష్ విట్టా కూడా చక్కగా ఆడుతూ.. గొడవలకు దూరంగానే ఉంటున్నాడు. ఇక రాహుల్ సిప్లిగంజ్ ఒకసారి ఎలిమినేట్ అయ్యి.. అది కాస్తా ఫేక్ ఎలిమినేషన్ అంటూ మళ్ళీ హౌస్‌లోకి రీ-ఎంట్రీ ఇచ్చాడు. దీనితో వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్ నుంచి తప్పించుకున్నారని చెప్పొచ్చు.

ఇక చివరిగా మిగిలిన పునర్నవి.. రాహుల్‌తో లవ్ గేమ్ తప్పితే.. సరిగ్గా ఏ టాస్క్‌లోనూ చురుకుగా పాల్గొలేదు. అంతేకాక కిందటి వారం రవికృష్ణను అనవసరంగా తిట్టిందని సోషల్ మీడియాలో టాక్ ఉంది. ఇక రవి కూడా బయటికి వచ్చి.. తన బాధను చెప్పుకున్నాడు. దీనితో పునర్నవి ఈ వారం హౌస్ నుంచి ఎగ్జిట్ కానుందని నెట్టింట్లో ఓ వార్త హల్చల్ చేస్తోంది.

మరోవైపు ప్రస్తుతం ఓటింగ్‌లో ఈమె చివరి స్థానంలో ఉంది. అయితే వీకెండ్ వచ్చేలోపు ఏదైనా జరగొచ్చు.. ఊహించని విధంగా డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండొచ్చు. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉన్నా.. లవ్ బర్డ్స్ కానీ.. మహేష్ విట్టాతో పాటు పునర్నవి బయటికి వెళ్లే అవకాశాలు ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి అసలు ఏం జరుగుతుందో.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu