శ్రీదేవి బయోపిక్‌లో మాధూరి దీక్షిత్?

శ్రీదేవి బయోపిక్‌లో మాధూరి దీక్షిత్?

అందాల అతిలోకసుందరి శ్రీదేవి ఈలోకాన్ని విడిచి సంవత్సరం అయిపోయింది. ఇప్పటికీ ఆమె మన మధ్యలో లేదంటే చాలామంది న‌మ్మ‌లేక‌పోతున్నారు.బాల‌న‌టిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన శ్రీదేవి తెలుగు, త‌మిళంతో పాటు హిందీలోనూ న‌టించి.. దేశంలోని ప్ర‌తి ఒక్క‌రి అభిమాన నాయిక‌గా మారిపోయింది. తన అందం, అభినయంతో అంద‌రినీ ఆకట్టుకున్న ఈ అందాల తార లేని లోటు ఎవ‌రూ తీర్చ‌లేనిది. ముఖ్యంగా ఆమె కుటుంబస‌భ్యులు త‌ను లేద‌నే నిజాన్ని ఇప్పుడిప్పుడే జీర్ణించుకుంటూ.. బాధ నుంచి కోలుకుంటున్నారు. ద‌క్షిణాది చిత్రాల‌తో త‌న కెరీర్ […]

Ram Naramaneni

|

Feb 25, 2019 | 1:15 PM

అందాల అతిలోకసుందరి శ్రీదేవి ఈలోకాన్ని విడిచి సంవత్సరం అయిపోయింది. ఇప్పటికీ ఆమె మన మధ్యలో లేదంటే చాలామంది న‌మ్మ‌లేక‌పోతున్నారు.బాల‌న‌టిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన శ్రీదేవి తెలుగు, త‌మిళంతో పాటు హిందీలోనూ న‌టించి.. దేశంలోని ప్ర‌తి ఒక్క‌రి అభిమాన నాయిక‌గా మారిపోయింది. తన అందం, అభినయంతో అంద‌రినీ ఆకట్టుకున్న ఈ అందాల తార లేని లోటు ఎవ‌రూ తీర్చ‌లేనిది. ముఖ్యంగా ఆమె కుటుంబస‌భ్యులు త‌ను లేద‌నే నిజాన్ని ఇప్పుడిప్పుడే జీర్ణించుకుంటూ.. బాధ నుంచి కోలుకుంటున్నారు.

ద‌క్షిణాది చిత్రాల‌తో త‌న కెరీర్ ప్రారంభించిన శ్రీదేవి సౌతిండియాతో పాటు.. బాలీవుడ్‌లోనూ నాలుగు ద‌శాబ్దాల‌పాటు త‌న న‌ట‌నా ప్రస్థానాన్ని కొనసాగించగలిగింది. త‌న జ‌న‌రేష‌న్‌కి చెందిన న‌టులంద‌రితోనూ క‌లిసి న‌టించిన శ్రీదేవి లేడీ సూప‌ర్‌స్టార్‌గా పేరుప్ర‌ఖ్యాతులు గ‌డించింది.

ప్ర‌స్తుతం మ‌న దేశంలో బయోపిక్‌ల ట్రెండ్ న‌డుస్తోంది. అటు రాజ‌కీయ నాయ‌కుల‌తో పాటు.. ఇటు సినీరంగానికి చెందిన వారి బ‌యోపిక్‌లు ప్రేక్ష‌కుల ఆద‌రాభిమానాల‌ను చూర‌గొంటున్నాయి. శ్రీదేవి జీవిత నేప‌థ్యంలో ఓ చిత్రం చేయాల‌ని ప‌లువురు ద‌ర్శ‌క నిర్మాత‌లు స‌న్నాహాలు చేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో వారికంటే ముందే బోని.. శ్రీదేవి బ‌యోపిక్ చేయాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. శ్రీదేవి గురించి పూర్తిగా తెలిసిన బోని క‌పూర్ ఆ చిత్రానికి న్యాయం చేయ‌గ‌ల‌డ‌ని అభిమానులు కూడా భావిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేయ‌నున్నాడ‌ని స‌మాచారం. ఇప్ప‌టికే శ్రీదేవి జీవితంపై సినిమా తీయడానికి కాపీ రైట్స్‌ కూడా తీసుకునే ప‌నిలో బోనీ ఉన్నాడ‌ని స‌మాచారం. పుస్త‌క రూపంలోను శ్రీదేవి జీవితాన్ని ప్ర‌జ‌ల ముందుకు తీసుకురానున్నాడ‌ట బోని.

అయితే బయోపిక్ తీస్తే ఆ పాత్రకు పర్‌ఫెక్ట్ యాప్ట్‌గా మాధూరి దీక్షిత్‌ని భావిస్తున్నారంట బోని. శ్రీదేవికి ఉన్న ఫీచర్స్ అన్ని మాధూరికి ఉండటంతో పాటు కపూర్ ఫ్యామిలీతో ఆమెకు మంచి అనుభందం ఉంది. అంతేకాదు గతంతో బోని కపూర్ తమ్ముడు, అనిల్ కపూర్‌తో బేటా, తజాబ్ లాంటి క్లాసిక్ చిత్రాలలో నటించింది మాధూరి దీక్షిత్. అయితే శ్రీదేవి ఎప్పుడూ తన బయోపిక్‌ను వెండితెరపైకి తీసుకురావాలనుకోలేదు. ఒకవేళ తీసినా తన జాన్వీ కపూర్‌నే అందులో యాక్ట్ చేయాలనుకునేదట. అయితే యంగ్ శ్రీదేవి పాత్రలో జాన్వీ యాప్ట్ అయినా కాస్త మెచ్యర్డ్ శ్రీదేవి పాత్రలో మాత్రం సెట్ అవ్వదని సినీ పండితుల అభిప్రాయం. మరి ఈ బయోపిక్ ఎప్పుడు పట్టాలెక్కుందో, అందులో ఎవరు యాక్ట్ చేస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu