Sandalwood Drugs Case: శాండిల్‌వుడ్‌ని డ్రగ్స్ కేసు కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో సినీ ప్రముఖులు చాలామందే ఉన్నారు. ఇదిలా ఉంటే తాజా సమాచారం ఈ కేసులో ప్రముఖ నటుడు వివేక్ ఒబెరాయ్ భార్య ప్రియాంక అల్వా ఒబెరాయ్‌కి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సమన్లు జారీ చేశారు. దాని ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల లోపు ఆమె సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ముందు హాజరుకావాల్సి ఉంది. అయితే అందుకు ఆమె గైర్హాజరైనట్లు తెలుస్తోంది. అంతేకాదు తన తరఫున వివరణతో ఎలాంటి న్యాయ ప్రతినిధిని పంపనట్లు సమాచారం. దీంతో ఆమెపై చర్యలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
కాగా డ్రగ్స్ కేసులో ప్రియాంక సోదరుడు, కర్ణాటక మాజీ దివంగత మంత్రి జీవరాజ్ అల్వా కుమారుడు ఆదిత్య అల్వా నిందితుడిగా ఉన్నారు. ఈ క్రమంలో బెంగళూరులోని అతడి ఫామ్‌హౌజ్‌పై ఇటీవల అధికారులు సోదాలు నిర్వహించారు. అంతేకాదు వివేక్ ఒబెరాయ్ ఇంట్లో సైతం గురువారం అధికారులు దాడులు చేశారు. ఆదిత్య ప్రస్తుతం అఙ్ఞాతంలో ఉండటంతో.. అతడి ఆచూకీ కోసం ప్రియాంకను విచారించేందుకు నోటీసులు జారీ చేసినట్లు ఓ అధికారి తెలిపారు.
Read More:
హీరో రాజశేఖర్ ఇంట్లో అందరికీ కరోనా పాజిటివ్
దసరా ఉత్సవాలు: బిడ్డలను ఎత్తుకున్న ‘దుర్గమ్మ’.. మొత్తానికి ఇంటికి చేరుకుంది