మొదలైన విజయ్ ఆంటోనీ సిక్స్ ప్యాక్‌ మూవీ

|

Mar 05, 2019 | 10:32 AM

చెన్నై: బిచ్చగాడు ఫేం విజయ్ ఆంటోనీ మరో సరికొత్త మూవీతో రాబోతున్నారు. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకుంటున్న విజయ్ ఈ సారి సిక్స్‌ ప్యాక్‌లో కనిపించబోతున్నాడట. ఈ సిక్స్ ప్యాక్ కోసం గత ఆరు నెలలుగా విజయ్ ఆంటోనీ శ్రమిస్తున్నాడు. సెంథిల్ కుమార్ దర్శకత్వంలో ఆయన తాజాగా నటిస్తున్న మూవీ ‘కాక్కి’ పూజా కార్యక్రమం జరిగింది. చిత్ర యూనిట్ మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొంది. విజయ్ భార్య ఫాతిమా కెమేరా స్విచాన్ చేశారు. ఈ చిత్రంలో కట్టప్ప […]

మొదలైన విజయ్ ఆంటోనీ సిక్స్ ప్యాక్‌ మూవీ
Follow us on

చెన్నై: బిచ్చగాడు ఫేం విజయ్ ఆంటోనీ మరో సరికొత్త మూవీతో రాబోతున్నారు. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకుంటున్న విజయ్ ఈ సారి సిక్స్‌ ప్యాక్‌లో కనిపించబోతున్నాడట. ఈ సిక్స్ ప్యాక్ కోసం గత ఆరు నెలలుగా విజయ్ ఆంటోనీ శ్రమిస్తున్నాడు. సెంథిల్ కుమార్ దర్శకత్వంలో ఆయన తాజాగా నటిస్తున్న మూవీ ‘కాక్కి’ పూజా కార్యక్రమం జరిగింది. చిత్ర యూనిట్ మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొంది.

విజయ్ భార్య ఫాతిమా కెమేరా స్విచాన్ చేశారు. ఈ చిత్రంలో కట్టప్ప ఫేం సత్యరాజ్, తెలుగు సీనియర్ నటి ఈశ్వరి రావు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. విజయ్ ఆంటోనీ పోలీసు పాత్రలో నటిస్తుండగా, అతని మామ పాత్రలో సత్యరాజ్ నటిస్తున్నారట. ఈ మూవీ గురించి దర్శకుడు సెంథిల్ మాట్లాడుతూ విజయ్ ఆంటోని మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్టు తెలిపారు. రెండు నెలల్లో చిత్రం పూర్తి చేయాలని చూస్తున్నామని కూడా డైరెక్టర్ తెలిపారు.