Tollywood: ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ నటి షావుకారు జానకి మృతి..

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూశారు. కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె గురువారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఆమె తుదిశ్వాస విడిచారు.

Tollywood: ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ నటి షావుకారు జానకి మృతి..
Sowcar Janaki

Updated on: Aug 21, 2026 | 3:02 PM

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూశారు. కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె గురువారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే కుటుంబసభ్యులు ఆమెను చెన్నైలోని కావేరి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఆమె తుదిశ్వాస విడిచారు. షావుకారు జానకి వయసు 94 సంవత్సరాలు. ఏడు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రయాణంలో దాదాపు నాలుగు భాషల్లో 450 పైగా సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేశారు. నాలుగు తరాల నటీనటులతో నటించిన గొప్ప ఘనత షావుకారు జానకి సొంతం. 1931 డిసెంబర్ 12న రాజమండ్రిలోని ఒక సాంప్రదాయ కుటుంబంలో జన్మించిన షావుకారు జానకి అసలు పేరు శంకరమంచి జానకి. చిన్నప్పటి నుంచి కళల మీద ఉన్న ఆసక్తితో కేవలం 14 ఏళ్ల వయసులోనే మద్రాసు వెళ్లి ఆకాశవాణిలో రేడియో ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించారు.

ఎక్కువమంది చదివినవి : Hemachandra : శ్రావణ భార్గవితో విడాకులు ?.. రూమర్స్ పై స్పందించిన హేమచంద్ర.. ఏమన్నారంటే..

చిన్న వయసులోనే వివాహం జరగడం, ఆ తర్వాత కనీసం మూడు పూటలా తినడానికి కూడా లేని పరిస్థితుల్లో ఆమె తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కుటుంబ భారాన్ని మోయడానికి, పిల్లల ఆకలి తీర్చడానికి తన భర్త అనుమతితో ఆమె సినిమా రంగం వైపు అడుగులు వేశారు. ఎల్వీ ప్రసాద్ గారి దర్శకత్వంలో 1950లో ఎన్టీఆర్ సరసన ‘షావుకారు’ సినిమాతో హీరోయిన్‌గా ఆమె సినీ రంగ ప్రవేశం చేశారు. తొలి సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో, ఆ సినిమా పేరే ఆమె ఇంటి పేరుగా మారిపోయి శాశ్వతంగా ‘షావుకారు’ జానకిగా చరిత్రలో నిలిచిపోయారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఓటీటీలో వణుకు పుట్టించిన సస్పెన్స్ థ్రిల్లర్.. ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండింగ్.. మైండ్ బ్లాకింగ్ హారర్ మూవీ..

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, శివాజీ గణేశన్, రాజ్ కుమార్, ప్రేమ్ నజీర్ లాంటి దిగ్గజ హీరోలందరి సరసన నటించి మెప్పించారు. ఎన్టీఆర్, ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత లాంటి నలుగురు ముఖ్యమంత్రులతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఏకైక సీనియర్ నటిగా ఆమె అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నారు. ఆ రోజుల్లోనే స్వశక్తితో మద్రాసులో సొంత ఇల్లు నిర్మించుకుని మహిళలకు ఆదర్శంగా నిలిచిన షావుకారు జానకి.. ఆమె ఇల్లు ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు వేదికగా నిలిచింది. హీరోయిన్‌గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ దశాబ్దాల పాటు అలరిస్తూ, 90 ఏళ్ల వయసులో కూడా సినిమాల్లో నటించి తన వృత్తి పట్ల ఉన్న అంకితభావం చాటుకున్నారు జానకి. ఏడున్నర దశాబ్దాల పాటు కళారంగానికి ఆమె చేసిన విశేష సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 2022లో ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

ఎక్కువమంది చదివినవి : Mokshagna : వారసుడు వచ్చేస్తున్నాడు.. దసరాకు మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..

ఎక్కువమంది చదివినవి : Jr.NTR : ఎన్టీఆర్‏తో చేసిన ఆ సినిమా ప్లాప్ కావడానికి కారణం అదే.. ఆ నిర్ణయమే పొరపాటు అయ్యింది..

Loading...
Unable to load recommendations.
Follow Us