Tollywood : ఆ సినిమాలో నేను హీరో.. చిరు విలన్.. టాలీవుడ్ నటుడు కామెంట్స్..

సీనియర్ నటుడు జీవీ నారాయణరావు తన సినీ ప్రస్థానాన్ని పంచుకున్నారు. చిరంజీవి, రజనీకాంత్ విలన్‌లుగా నటించినప్పుడు తను హీరోగా చేశానని, ANRతో బ్లాక్‌బస్టర్‌లు అందించానని తెలిపారు. కళాత్మక చిత్రాలపై తనకున్న మక్కువను, మృణాల్ సేన్ ఒక ఊరి కథ కోసం 27 రోజులు ఉపవాసం ఉండి పాత్రకు తగ్గట్టు మారిన అంకితభావాన్ని వివరించారు.

Tollywood : ఆ సినిమాలో నేను హీరో.. చిరు విలన్.. టాలీవుడ్ నటుడు కామెంట్స్..
Gv Narayana Rao

Updated on: Nov 25, 2026 | 9:53 PM

సీనియర్ నటుడు జీవీ నారాయణరావు సినీ పరిశ్రమలో తన సుదీర్ఘ ప్రయాణం గురించి, ఎందరో ప్రముఖులతో ఆయనకు ఉన్న అనుబంధం గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరలవుతున్నా్యి. నారాయణరావు గారు తన కెరీర్ ఆరంభంలో రంజిత్ మూవీస్ బ్యానర్‌పై రంగశర్మ దర్శకత్వంలో వరుసగా మూడు చిత్రాల్లో హీరోగా నటించారు. ఆ చిత్రాల్లో ఒకదానిలో రజనీకాంత్ విలన్‌గా, మరొకదానిలో చిరంజీవి విలన్‌గా నటించారని ఆయన గుర్తు చేసుకున్నారు. “విలన్‌లుగా రజనీకాంత్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు చేశారని ఎక్కువ మందికి ఈ జనరేషన్ వారికి తెలియదు. వాళ్ళు స్టార్ట్ చేసినవన్నీ విలన్ వేషాలతోనే,” అని ఆయన తెలిపారు. మోహన్‌బాబు కూడా ఇలాగే తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారని అన్నారు. తాను, రజనీకాంత్ ఒకేసారి ఇండస్ట్రీలోకి వచ్చామని, ఒకే స్కూల్‌లో చదువుకున్నట్లు ఒకే రూమ్‌లో ఉన్నామని చెప్పారు. అంతులేని కథ చిత్రంతో ఇద్దరూ ఒకేసారి అవకాశం పొందారని, ఒకే రోజు షూటింగ్‌కు హాజరయ్యామని ఆయన వివరించారు. చిరంజీవితో కుక్క కాటుకి చెప్పు దెబ్బ చిత్రంలో మొదట నటించానని, అప్పట్లో చిరంజీవి ఆయన రూమ్‌మేట్‌గా ఉన్నారని వెల్లడించారు. ఆ చిత్రంలో విలన్‌గా చిరంజీవి పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి: Akkineni : అన్నపూర్ణ సంస్థకు ఈ సినిమా చాలా ప్రత్యేకం.. 1967లో బాక్సాఫీస్ షేక్ చేసిన అక్కినేని మూవీ ఇదే..

కేవలం సహనటులతోనే కాకుండా, దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావుగారితో కలిసి జీవీ నారాయణరావు మూడు సూపర్ హిట్‌ చిత్రాల్లో నటించారు. “నేను అభిమానించే అక్కినేని నాగేశ్వరరావు గారితో కూడా మంచి మూడు సినిమాలు చేశాను. ఆ మూడు కూడా సూపర్ హిట్లు,” అని ఆయన అన్నారు. వాటిలో ఆలుమగలు చిత్రంలో కొడుకుగా, బహుదూర బాటసారిలో అల్లుడిగా (సుహాసిని భర్తగా), సీతారామయ్య గారి మనవరాలులోనూ అల్లుడి పాత్రలో నటించారు. ఈ మూడు చిత్రాలు సిల్వర్ జూబ్లీ విజయాన్ని సాధించాయని ఆయన సగర్వంగా చెప్పుకున్నారు. తన కెరీర్‌లో తక్కువ సినిమాలు చేసినా ఎక్కువ హిట్లు ఉన్నాయని తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి: Jaya Prada : ఇప్పుడున్న హీరోలలో అతడంటే చాలా ఇష్టం.. చాలా మంచి వ్యక్తి.. హీరోయిన్ జయప్రద..

వాణిజ్య చిత్రాలతో పాటు, జీవీ నారాయణరావు కళాత్మక చిత్రాలపై తనకున్న మక్కువను కూడా తెలియజేశారు. ఇండస్ట్రీలో తనకు “ఈయన ఆర్ట్ ఫిల్మ్‌ల యాక్టర్రా, ఈయన కమర్షియల్ సినిమాలకు పనికిరాడు” అనే చెడ్డ పేరు కూడా ఉందని అంగీకరించారు. తాను ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకుని రావడంతో, మంచి సినిమాలు చేయటం అలవాటు అయిందని, ఫిలిం ఫెస్టివల్స్‌కు వెళ్లి ప్రపంచ సినిమాలను చూసే అవకాశం లభించిందని చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి: Trending Song: ఏముంటది భయ్యా ఈ పాట.. ఇప్పట్లో ఇలాంటి సాంగ్ ఎప్పటికీ రాదు.. 26 ఏళ్లైనా తగ్గని క్రేజ్..

ఎక్కువ మంది చదివినవి: Raghu Babu : కష్టాల్లో ఉన్నప్పుడు అన్నం పెట్టిన దేవుడు ఆయనే.. ఒక్క సినిమాతో 25 ఏళ్ల ఆస్తులు అమ్ముకున్నాం..

Loading...
Unable to load recommendations.
Follow Us