
టాలీవుడ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌ల ద్వారా గుర్తింపు తెచ్చుకుని, ఆపై వెండితెరపై కథానాయికగా మంచి సక్సెస్ సాధించింది ఈ తెలుగు అమ్మాయి. సాఫ్ట్ వేర్ డెవలపర్ సిరీస్ ద్వారా పాపులర్ అయిన ఆమె అల వైకుంఠపురములో వంటి చిత్రాల్లో చిన్న పాత్రల్లో కనిపించిన ఆమె, ‘బేబీ’ సినిమాతో హీరోయిన్‌గా మారింది. తొలి చిత్రంతోనే ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయారు. అయితే ఈ సినిమా ఇచ్చిన అపారమైన విజయం ఒకవైపు ఉంటే, ఆ చిత్రంలో తాను పోషించిన పాత్ర కారణంగా ఆమె ఎదుర్కొన్న తీవ్రమైన ట్రోలింగ్ మరొకవైపు ఆమెను తీవ్రంగా కలిచివేసిందట. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వైష్ణవి ఈ విషయంపై స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె నటించిన ఎపిక్ సినిమా థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుంది.
అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడిన వైష్ణవి, ‘బేబీ’ సినిమా విడుదల సమయంలో తన పాత్రను చూసి కొందరు దారుణంగా మాట్లాడారని వెల్లడించారు. “ప్రతి ఒక్కరూ ఒక నిర్ణయం తీసుకోవడానికి లేదా ఒక స్టెప్ వేయడానికి ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది. కానీ కొందరు ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు. ఇన్ని రోజులు కష్టపడి ఇక్కడికి వచ్చింది దీని కోసమేనా అని అనిపించింది. కొంతమంది నోటికొచ్చినట్లు మాట్లాడడమే కాకుండా, చెప్పులు తీసుకుని సినిమా పోస్టర్లను కొట్టారు. ఆ సమయంలో అసలు సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేయాలో లేక ఇలాంటి వ్యాఖ్యలకు బాధపడాలో అర్థం కాక ఒక వేరే జోన్‌లోకి వెళ్ళిపోయాను” అని వైష్ణవి తెలిపారు.
అయితే ఆ ప్రతికూల వ్యాఖ్యలను అధిగమించడానికి తాను పాజిటివ్ మైండ్‌సెట్‌ను అలవర్చుకున్నట్లు వైష్ణవి పేర్కొన్నారు. “నా ఫీలింగ్స్‌తో వాళ్లకు సంబంధం లేదు. కాబట్టి కొద్దిరోజుల తర్వాత ఆ ట్రోల్స్ పట్టించుకోవడం మానేసి, కేవలం పాజిటివ్ విషయాలపైనే దృష్టి పెట్టాను. థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకులు నా నటన గురించి, క్యారెక్టర్ ఇచ్చిన ఇంపాక్ట్ గురించి మాట్లాడుకుంటున్నారంటే నటిగా నేను విజయం సాధించినట్లేనని నాకు నేనే సర్దిచెప్పుకున్నాను” అని అన్నారు. తన చిన్ననాటి జీవితానికి, ‘బేబీ’ పాత్రకు ఉన్న సంబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. చాంద్రాయణగుట్ట లాంటి ప్రాంతం నుండి వచ్చి జూబ్లీహిల్స్ వాతావరణాన్ని చూడటం ఒక కొత్త అనుభవమని, ఆ తేడానే తన క్యారెక్టర్‌ను మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడిందని చెప్పారు. కొన్ని సన్నివేశాల్లో గ్లిజరిన్ కూడా లేకుండా సహజంగా ఏడ్చానని, క్లైమాక్స్ సన్నివేశంతోనే షూటింగ్ ప్రారంభమైన రోజులను ఆమె గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం వైష్ణవి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతున్నాయి.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : బాబోయ్.. నెట్టింట గత్తరలేపుతున్న దండుపాళ్యం బ్యూటీ.. ఆమె ఇన్ స్టా చూస్తే..
ఎక్కువ మంది చదివినవి : Tollywood: సినిమా మొత్తం హీరో ఒకే రంగు షర్ట్ లో ఉంటాడు.. హిట్టు కాదన్నారు.. థియేటర్లు హౌస్ ఫుల్ అయ్యాయి..