ఒక్క సినిమాతోనే సెన్సేషన్.. బ్లాక్ డ్రెస్‏లో కవ్విస్తున్న హీరోయిన్..

Rajitha Chanti

Pic credit - Instagram

13 September 2026

టాలీవుడ్ నటి, తెలుగమ్మాయి రూప కొడువాయుర్ తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు కుర్రకారును ఆకట్టుకుంటున్నాయి.

రూప కొడువాయుర్

నూతన తరహా ఫ్యాషన్ ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ అందరి దృష్టిని ఆకర్షించే రూప.. ఈసారి సరికొత్త బ్లాక్ డ్రెస్‌లో మెరిసిపోయారు. నలుపు రంగు దుస్తులలో రూప కొడువాయుర్ చాలా అందంగా కనిపిస్తున్నారు. 

రూప కొడువాయుర్

ఆమె ఇచ్చిన క్యూట్ అండ్ స్టైలిష్ పోజులు నెట్టింట వైరల్‌గా మారాయి. తెలుగు తెరపై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ, గ్లామర్ పరంగానూ తగ్గేదేలే అంటోంది.

రూప కొడువాయుర్

సామాజిక మాధ్యమాలలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే రూప.. తన లేటెస్ట్ ఫోటోషూట్‌లను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ తాజా బ్లాక్ డ్రెస్ ఫొటోల్లో మోడ్రన్‌ లుక్‌లో కనిపించారు. 

రూప కొడువాయుర్

సినిమా అవకాశాలతో పాటు సోషల్ మీడియాలోనూ తన ఫాలోయింగ్‌ను విపరీతంగా పెంచుకుంటున్న రూప కొడువాయుర్, ఈ పిక్స్‌తో మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చారు. 

రూప కొడువాయుర్

ఆమె అందాన్ని చూసిన నెటిజన్లు "సూపర్ లుక్", "అందమైన తెలుగమ్మాయి" అంటూ కామెంట్లు పెడుతున్నారు. రూప లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి 

రూప కొడువాయుర్

సత్యదేవ్ హీరోగా వచ్చిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రంతో రూప కథానాయికగా పరిచయమయ్యారు. జ్యోతి పాత్రలో ఆమె నటనకు మంచి ప్రశంసలు లభించాయి.

రూప కొడువాయుర్

ఈ సినిమాలోని నటనకుగానూ ఆమె 'సైమా ఉత్తమ తొలిచిత్ర నటి' అవార్డును అందుకున్నారు. మిస్టర్ ప్రెగ్నెంట్, సారంగపాణి జాతకము వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

రూప కొడువాయుర్