త్రిష ‘గిఫ్టెడ్‌ ఆర్టిస్ట్’‌.. ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రశంసలు

చెన్నై చంద్రం త్రిష నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సినిమా నుంచి సహజ నటనతో అందరిని ఆకట్టుకుంటూ వస్తోన్న త్రిష..

త్రిష గిఫ్టెడ్‌ ఆర్టిస్ట్‌.. ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రశంసలు

Updated on: Jul 17, 2020 | 2:48 PM

చెన్నై చంద్రం త్రిష నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సినిమా నుంచి సహజ నటనతో అందరిని ఆకట్టుకుంటూ వస్తోన్న త్రిష.. ఇప్పటికీ 70కి పైగా చిత్రాల్లో నటించారు. అంతేకాదు దక్షిణాది భాషలన్నింటిలో నటించిన హీరోయిన్‌గా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా త్రిషపై ప్రశంసలు కురిపించారు ప్రముఖ కొరియోగ్రాఫర్ బృంద మాస్టర్‌.

”త్రిషతో నేను పలు భాషల్లో చాలా సినిమాల్లో పని చేశా. తను ఇండస్ట్రీకి దొరికిన ఓ సహజ నటి. బయటే కాదు లోపల కూడా ఆమె చాలా అందమైనది. ఎన్ని సంవత్సరాలు గడిచినా మా ఇద్దరి మధ్య బంధం ఇప్పటికీ మారలేదు. లవ్‌ యు” అని కామెంట్ పెట్టారు. ఈ సందర్భంగా త్రిషతో తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా పలు భాషల్లో వేలాది పాటలకు డ్యాన్స్ కంపోజ్ చేసిన బృంద ఇప్పుడు దర్శకురాలిగా మారారు. దుల్కర్ హీరోగా హే సినామిక అనే మూవీని ఆమె తెరకెక్కిస్తున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్, అదితీ రావు హైదారీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us