
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కేవలం హంగామా చేసే పాటల కంటే, గుండెల్లో నిలిచిపోయే సంగీతాన్ని అందించే ప్రతిభావంతులకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆ కోవలోనే ఎలాంటి హడావుడి లేకుండా, కేవలం తన అద్భుతమైన మ్యూజిక్‌తో సైలెంట్‌గా దూసుకొస్తున్నాడు యంగ్ మ్యూజిక్ కంపోజర్ ‘స్మరణ్’. ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత ప్రతిభావంతులైన సంగీత దర్శకులలో ఒకడిగా ఎదుగుతున్న స్మరణ్ కెరీర్‌లో ‘రావు బహదూర్’ చిత్రం ఒక మైలురాయిగా మారింది. స్మరణ్ టాలెంట్ గురించి ఇండస్ట్రీ వర్గాలకు ఇప్పటికే ఒక స్పష్టమైన అవగాహన ఉంది. గతంలో సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘కొత్త పోరడు’, డిఫరెంట్ థ్రిల్లర్ ‘పచ్చీస్’ వంటి ప్రాజెక్ట్‌లకు ఆయన అందించిన సంగీతం మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. వీటన్నింటికీ మించి, టాలీవుడ్‌లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ‘ఆర్ఎక్స్ 100’ సినిమాకు స్మరణ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా సక్సెస్‌లో ఎంత కీలక పాత్ర పోషించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ‘రావు బహదూర్’ చిత్రంతో తన సంగీత సామర్థ్యాన్ని మరోస్థాయికి తీసుకెళ్లాడు.
ప్రతిభావంతుడైన దర్శకుడు వెంకటేష్ మహా (కేరాఫ్ కంచరపాలెం ఫేమ్) దర్శకత్వంలో తెరకెక్కిన ‘రావు బహదూర్’ చిత్రం ఇప్పటికే ఇండస్ట్రీలో, ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా విడుదలకు ముందే ఇండస్ట్రీలోని ప్రముఖులు, స్క్రీనింగ్ చూసిన కొద్దిమంది ఈ చిత్రంలోని సినిమాటిక్ విజన్‌ను, మేకింగ్‌ను ప్రశంసలతో ముంచెత్తారు.
ఇది కూడా చదవండి : Prabhas: ప్రభాస్‌కు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆమె నా క్రష్ అంటున్న రెబల్ స్టార్
స్మరణ్‌కు ఈ సినిమా కేవలం మరొక ప్రాజెక్ట్ మాత్రమే కాదు.. కథలోని ఎమోషన్, అట్మాస్ఫియర్, మరియు స్టోరీ టెల్లింగ్‌ను తన సంగీతంతో ఎలివేట్ చేసే ఒక గొప్ప అవకాశం అని చెప్పాలి. హంగూ ఆర్భాటాల కంటే కంటెంట్‌కు ప్రాధాన్యతనిచ్చే స్మరణ్ మార్క్ మ్యూజిక్.. ‘రావు బహదూర్’ ద్వారా మరింతగా ప్రేక్షకులకు చేరువ కానుంది. టాలీవుడ్ ప్రస్తుతం సరికొత్త క్రియేటివ్ వాయిస్‌లను ప్రోత్సహిస్తున్న తరుణంలో స్మరణ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి