Year Ender : రచ్చ రచ్చ 2025.. ఈ ఏడాది ఇండస్ట్రీలో జరిగిన కాంట్రవర్సీలు ఇవే..

మరి కొద్దీ రోజుల్లో 2025కు గుడ్ బై చెప్పనున్నాం.. ఈ ఏడాది చాలా చిత్ర విచిత్రాలు జరిగాయి. చిన్న సినిమాలు సంచలన విజయాలను అందుకున్నాయి. అలాగే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు భారీ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అదేవిధంగా భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమాలు మాత్రం దారుణంగా నిరాశపరిచాయి.

Year Ender : రచ్చ రచ్చ 2025.. ఈ ఏడాది ఇండస్ట్రీలో జరిగిన కాంట్రవర్సీలు ఇవే..
2025controversy

Updated on: Dec 26, 2025 | 2:57 PM

మరికొద్ది రోజుల్లో ఈ ఏడాదికి గుడ్ బై చెప్పనున్నాం.. కొత్త ఏడాదిని ఆహ్వానించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్ ను ఎంతో గ్రాండ్ గా జపరుపుకోనున్నారు. కాగా ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీకి ఎన్నో జ్ఞాపకాలను మిగిలిచింది. కొన్ని విషాదాలు జరిగాయి. కొన్ని సంతోషకరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. వీటితో పాటే ఎన్నో వివాదాలు కూడా వార్తల్లో నిలిచాయి. ఇక ఈ ఏడాది కాంట్రవర్సీల విషయానికొస్తే దీపికా పదుకొనె దగ్గర నుంచి మొన్న శివాజీ వరకు రకరకాల కాంట్రవర్సీలు ఇండస్ట్రీలో చోటు చేసుకున్నాయి. వాటి పై ఓ లుక్కేద్దాం.!

ఈ ఏడాది ఎక్కువగా వార్తల్లో నిలిచిన వివాదం దీపికా పదుకొణే 8 గంటల వర్క్ డిమాండ్. సందీప్ రెడ్డి వంగ, ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమా కోసం సందీప్ దీపికను ఎంపిక చేయగా.. ఆమె గొంతెమ్మ కోరికలు దెబ్బకు వెనకడుగు వేశాడు. సోషల్ మీడియా వేదికగా ఆమె చేసిన డిమాండ్ ను బయట పెట్టాడు. దాంతో అది కాస్త పెద్ద ఇష్యూ అయ్యింది. ఆతరువాత కల్కి 2 సినిమా నుంచి దీపికాను తీసేశారు కూడా.. దీని పై దీపికా కూడా స్పందించింది.

ఆతర్వాత దీపికా భర్త రణవీర్ సింగ్.. మామూలుగానే హైపర్ యాక్టివ్ గా ఉండే రణవీర్ సింగ్ కొన్ని సందర్భాల్లో హద్దు దాటుతూ ఉంటారు. ఈ క్రమంలోనే కన్నడ బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా మూవీ కాంతార 2 సినిమా పై వెకిలి కామెంట్స్ చేశారు. ఆతర్వాత క్షమాపణ కూడా చెప్పాడు. కానీ అప్పటికే మనోడి పై ఓ రేంజ్ లో ట్రోల్స్ జరిగాయి. అలాగే బాలీవుడ్ లో సైఫ్ అలీ ఖాన్ పై హత్యాయత్నం కూడా పెద్ద దుమారం రేపింది. చివరిగా నిన్నకాక మొన్న శివాజీ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. హీరోయిన్స్ డ్రస్సింగ్ పై ఆయన చేసిన కామెంట్స్ పై వివాదం రేగింది. కొంతమంది ఆయనను సమర్దిస్తే మరికొంతమంది విమర్శించారు. ఈ వివాదం పై శివాజీ  క్లారిటీ ఇచ్చారు కూడా.. ఫైనల్ గా తెలుగు కంటే హిందీలోనే ఎక్కువ వివాదాలు రేగాయి. అమితాబ్ బచ్చన్ భార్య జయాబచ్చన్ ఫోటోగ్రాఫర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేయడం, శిల్పా శెట్టి భర్త వివాదంలో చిక్కుకోవడం వంటివి జరిగాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.