Toxic Boxoffice Collection: డివైడ్ టాక్ తోనే దుమ్మురేపింది.. తొలి రోజు టాక్సిక్ ఎంత వసూల్ చేసిందంటే

రాకింగ్ స్టార్ యశ్ నటించిన లేటెస్ట్ సినిమా ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూశారు. ఇక ఈ నెల 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది టాక్సిక్. బుధవారం (ఆగస్టు 26) ఈ సినిమా పెద్ద ఎత్తున థియేటర్లలో రిలీజ్ అయ్యింది

Toxic Boxoffice Collection: డివైడ్ టాక్ తోనే దుమ్మురేపింది.. తొలి రోజు టాక్సిక్ ఎంత వసూల్ చేసిందంటే
Toxic Movie

Updated on: Aug 27, 2026 | 11:37 AM

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన టాక్సిక్ సినిమా ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమా విడుదలైన తర్వాత మాత్రం ఉహించాయని రెస్పాన్స్ వస్తుంది. భారీ అంచనాలు పెట్టుకున్న ఆడియన్స్ సినిమా చూసి కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో ఎదో ఉంటుందని అనుకుంటే మరేదో ఉంది అంటూ తెగ ఫీల్ అవుతున్నారు ఆడియన్స్. దాంతో సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తుంది. కాగా ఈ సినిమాలో యష్ తన నటనతో ఆకట్టుకున్నాడు. అలాగే హీరోయిన్స్ కూడా తమ గ్లామర్ తో ప్రేక్షకులను కవ్వించారు. ఇదిలా ఉంటే టాక్సిక్ సినిమా విడుదలకు ముందు రికార్డ్స్ క్రియేట్ చేసింది. భారీ బజ్ కారణంగా సినిమా  అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీగా జరిగాయి. దాంతో సినిమాకు తొలి రోజే రికార్డ్ స్థాయిలో కలెక్ల్షన్స్ వచ్చాయి.

ఏంది భయ్యా ఈ సిరీస్ ఇలా ఉంది..! పచ్చి బూతులు, బోల్డ్ సీన్స్.. ఒంటరిగా చూడాల్సిందే

మొదటి రోజు టాక్సిక్ సినిమా ఏకంగా రూ. 100 కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది. ఈ చిత్రం ఇండియాలో 24,579 షోలలో రూ. 101.10 కోట్ల నికర వసూళ్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అయితే కేజీఎఫ్ 2 సినిమా ఇండియా వైడ్ గా రూ. రూ. 116 కోట్లువసూల్ చేసింది. కానీ టాక్సిక్ దాన్ని అందుకోలేకపోయింది. విదేశాలలో ఈ చిత్రం రూ.20.00 కోట్లు వసూలు చేయగా, ప్రపంచవ్యాప్తంగా దీని మొత్తం వసూళ్లు రూ.140.75 కోట్ల వరకు వసూల్ చేసింది ఈ సినిమా.

ఇవి కూడా చదవండి

అతను కమెడియన్ కాదు దేవుడు..! సాయం చేయమని కోరితే.. 3 నెలలకు సరిపడా సరుకులు ఇచ్చాడు..

మొత్తానికి హిందీ బెల్ట్ ఏకంగా రూ. 55 కోట్లు అందించింది. కన్నడ రూ. 23.30 కోట్లు, తెలుగులో రూ.16కోట్లు, మలయాళం రూ. 1.30 కోట్లు, తమిళం రూ. 5.50 కోట్లు టాక్సిక్ సినిమా వసూల్ చేసింది. సినిమాకు డివైడ్ టాక్ రావడంతో రానున్న రోజుల్లో ఆ ప్రభావం సినిమాపై పడే అవకాశం లేకపోలేదు.

ఆ హీరో అంటే నాకు పిచ్చి.. ఒక్కసారైనా కలవాలి..! మనసులో మాట బయటపెట్టిన బ్యూటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us