ఈ మధ్య కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా అన్ని సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. అయితే అక్కినేని అఖిల్ కు మాత్రం ఒక్క హిట్ పడటం లేదు. అక్కినేని ఫ్యామిలీ నుంచి చాల మంది హీరోలు ఇండస్ట్రీలోకి వచ్చారు. అయితే ఎక్కడో ఒక్క సినిమాతో అయినా ఈ హీరోలందరూ హిట్స్ అందుకున్నారు. కానీ అఖిల్ మాత్రం సక్సెస్ కోసం ఇప్పటికీ చాలా కష్టపడుతున్నారు. అఖిల్ ఎంట్రీతోనే భారీ సినిమాతో ఇచ్చాడు. వి.వి వినాయక్ దర్శకత్వంలో అఖిల్ అనే టైటిల్ తో సినిమా చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. దాంతో హలో అనే ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా ఫ్యాన్స్ ను నిరాశపరిచింది. ఆ తర్వాత చిన్న గ్యాప్ తీసుకొని మిస్టర్ మజ్ను అనే సినిమా చేశారు. ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
ఆతర్వాత బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అనే సినిమా చేశారు. ఈ సినిమా మంచి టాక్ తెచుకున్నప్పటికీ ఆ క్రెడిట్ అంతా పూజాహెగ్డేకి ఖాతాలో పడింది. సినిమాలో కూడా ఎక్కువ శాతం పూజాహెగ్డే పై ఉండటం కూడా అక్కినేని ఫ్యాన్స్ ను నిరాశపరిచింది.
Couldn’t think of a WILDER WAY to Launch the BIG TICKET… Thank you my brother… This one is very special to me… @AlwaysRamCharan ❤️❤️#Agent From Tomorrow. #AgentWildRideBegins pic.twitter.com/hECoighPcr
— Akhil Akkineni (@AkhilAkkineni8) April 27, 2023
ఇక భారీ అంచనాలు పెట్టుకున్న ఏజెంట్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నిరాశపరిచింది. దాంతో అఖిల్ ఇప్పుడు ఎలాంటి సినిమాతో రాబోతున్నాడు.? ఎవరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.? అన్న డౌట్స్ మొదలయ్యాయి. అయితే అఖిల్ ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సినిమా చేస్తున్నారని తెలుస్తోంది.
Happiest Birthday @VenkyMama sir. Wishing you great success 🎉❤️❤️ pic.twitter.com/MK6fCNEpxY
— Srikanth Addala (@srikanthaddalaa) December 13, 2022
Witness the WILD ONE in his wildest action on the big screens 💥💥💥#AGENT RELEASING TOMORROW❤️🔥 pic.twitter.com/LtrihGXjR8
— Akhil Akkineni (@AkhilAkkineni8) April 27, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.