Chiranjeevi Twitter: ఒకప్పుడు హీరోల ఫాలోయింగ్‌ను వారి సినిమాలకు వచ్చే కలెక్షన్లు, థియేటర్ల వద్ద అభిమానుల సందడి ఆధారంగా లెక్కకట్టే వారు. కానీ ఈ సోషల్ మీడియాలో యుగంలో ఇందులోనూ మార్పు వచ్చింది. సోషల్ మీడియా అకౌంట్లలో ఎవరిని ఎక్కువ మంది ఫాలో అవుతుంటే వారికి అంత ఫాలోయింగ్ ఉన్నట్లు లెక్క. ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇలా సోషల్ మీడియా సైట్లలో ఫాలోవర్స్ ఆధారంగా తారల క్రేజ్‌ను అంచనా వేసే రోజులు వచ్చాయి.
ఈ క్రమంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ముందు వరుసలో ఉంటారు. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న చిరంజీవి సోషల్ మీడియాలోనూ ఓ రేంజ్లో దూసుకెళుతున్నారు. ట్విట్టర్ విషయానికొస్తే చిరంజీవిని ఏకంగా 93 వేలకుపైగా మంది ఫాలోఅవుతున్నారు. మరి చిరు ఎందరిని ఫాలో అవుతున్నారో తెలుసా? కేవలం ఒక్కరినే మాత్రమే. ఆ ఒక్కరు ఎవరంటే ప్రముఖ పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి. ఈ విషయాన్ని గమనించిన ఓ నెటిజన్ చిరంజీవి ట్విట్టర్ ప్రొఫైల్ ఫొటోను రామజోగయ్య శాస్త్రిని ట్యాగ్ చేసి షేర్ చేస్తూ.. ‘సర్, మీరు గమనించారో లేదో చిరంజీవి గారు ట్విట్టర్ లో ఫాలో అవుతున్న ఏకైక వ్యక్తి మీరు. మీ సుసంపన్నమైన జ్ఞానానికి అది చిరంజీవి గారు మీకు ఇచ్చిన బహుమతి’ అని ట్వీట్ చేశాడు. దీనికి ప్రతిగా స్పందించిన రామజోగయ్య శాస్ర్తి సదరు నెటిజన్ ట్వీట్ స్క్రీన్ షాట్‌ను పోస్ట్ చేస్తూ.. ‘చిరంజీవి సర్ ప్రేమ, ఆశీర్వాదాలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. కొండంత సంతోషంగా ఉన్నాను’ అని క్యాప్షన్ జోడించారు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్లు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే చిరు నటిస్తోన్న ఆచార్య చిత్రానికి రామ జోగయ్య శాస్త్రి పాటలు రాసిన విషయం తెలిసిందే.
@ramjowrites సార్, మీరు గమనించారో లేదో చిరంజీవి గారు ట్విట్టర్ లో ఫాలో అవుతున్న ఏకైక వ్యక్తి మీరు. మీ సుసంపన్నమైన జ్ఞానానికి అది చిరంజీవి గారు మీకు ఇచ్చిన బహుమతి. pic.twitter.com/FKUfI3huzt
— Ramesh B (@RameshB35240696) April 2, 2021
Forever indebted to the Mega love n blessings dear @KChiruTweets Sir?
Kondantha santhosham gaa unnanu ? https://t.co/ZRWgfL5jwA— RamajogaiahSastry (@ramjowrites) April 2, 2021
Also Read: Most Eligible Bachelor: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమానుంచి క్రేజీ అప్డేట్.. ఏప్రిల్ 5న…
Pawan Kalyan : పవన్ డేడికేషన్ కు ఫిదా అవుతున్న అభిమానులు.. వైరల్ అవుతున్న ఫోటోలు
Thalaivi Movie: తలైవి సినిమా నుంచి వీడియో సాంగ్ .. ఆకట్టుకుంటున్న పాట..