Vishal Movie: శరవణన్‌ దర్శకత్వం విశాల్.. షూటింగ్ మొదలు పెట్టిన చిత్రయూనిట్..

  తమిళ్ హీరో విశాల్ హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే చక్ర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశాల్

Vishal Movie: శరవణన్‌ దర్శకత్వం విశాల్.. షూటింగ్ మొదలు పెట్టిన చిత్రయూనిట్..

Updated on: May 07, 2021 | 10:18 AM

vishal new movie :  తమిళ్ హీరో విశాల్ హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే చక్ర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశాల్.. ఇప్పుడు మరో సినిమాతో అలరించడానికి సిద్దమయ్యాడు. విశాల్ కు తమిళ్ తోపాటు మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమా తెలుగులోనూ డబ్ అవుతూ విజయాలను అందుకుంటున్నాయి. తాజాగా తన కెరియర్ లో 31వ సినిమా ను ప్రారంభించాడు ఈ హీరో. ఈ సినిమాను శరవణన్‌ దర్శకత్వం వహిస్తుండగా.. విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. సినిమాకు ఇంకా టైటిల్ ను ఫిక్స్ చేయలేదు దాంతో విశాల్ 31 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాను షూట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేయనున్నారని తెలుస్తుంది.

సినిమా షూటింగ్ ను ప్రారంభిస్తున్నామని చిత్రయూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. కరోనా విజృంబిస్తున్నా కఠిన నిబంధనలు పాటిస్తూ షూటింగ్‌ కొనసాగించాలని నిర్ణయించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ చిత్రంపై అంచనాల్ని పెంచేసింది. ‘నాట్‌ ఏ కామన్‌ మ్యాన్‌’ అనే ట్యాగ్ లైన్ తో టైటిల్ ఉండబోతుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను ఒకేసారి విడుదల చేయాలని భావిస్తున్నారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Mandela Remake: త‌మిళ చిత్రం మండేలా రీమేక్‌లో న‌టించేది బండ్ల గ‌ణేశ్ కాదంటా.. తాజాగా వినిపిస్తోన్న కొత్త పేరు..

Genelia Reentry: భ‌ర్త నుంచి అనుమ‌తి పొందిన హాసిని.. టాలీవుడ్‌లోనే జెనిలీయా రీ ఎంట్రీ.?

Tamannah November Story: ఇంత‌కీ ఆ హ‌త్య చేసింది ఎవ‌రు.? ఆస‌క్తిక‌రంగా న‌వంబ‌ర్ స్టోరీ ట్రైల‌ర్‌..

 

Follow Us