
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుంది జన నాయగన్. గత కొన్ని నెలలుగా సెన్సార్ వివాదం కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఎట్టకేలకు అడియన్స్ ముందుకు వచ్చేసింది. జూలై 23న ఈ చిత్రం గ్రాండ్ గా విడుదలైంది. ఉదయం నుంచే ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించగా.. కేరళ కుట్టి మమితా బైజు కీలక పాత్ర పోషించింది. ఇక బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించి మెప్పించారు.ఈ సినిమాకు తమిళనాడులో తెల్లవారుజామున నుంచే థియేటర్లలో అభిమానుల సందడి కనిపించింది. సినిమా విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డు సృష్టించింది జన నాయగన్. ఇక ఇప్పుడు బాక్సాఫీస్ కలెక్షన్లలోనూ ఈ మూవీ సత్తా చాటినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి మొదటి రోజు భారీ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం.
ఎక్కువ మంది చదివినవి : రోజుకు 15000 అడుగులు నడుస్తా.. టిఫిన్లు అస్సలు చేయను.. 86 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‌గా.. మురళీ మోహన్ డైట్ సీక్రెట్ ఇదే..
నివేదికల ప్రకారం ఈ మూవీకి గత రాత్రి 9 గంటల వరకు దేశవ్యాప్తంగా రూ.28.71 కోట్ల నెట్ వసూళ్లు వచ్చినట్లు సమాచారం. ఇందులో అత్యధికంగా తమిళనాడు నుంచే వచ్చినట్లు టాక్. దీంతో విజయ్ క్రేజ్ ఏ స్థాయిలోఉందో అర్థమవుతుంది. ఈ చిత్రాన్ని జన నాయకుడు పేరుతో తెలుగులోనూ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక తెలుగు వెర్షన్ కు రూ.89 లక్షల నెట్ వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు సూచిస్తున్నాయి. హిందీ వెర్షన్ రూ.73 లక్షలు వచ్చినట్లు సమాచారం. అన్ని భాషలలలో కలిపి గురువారం ఒక్కరోజే భారతదేశంలో రూ.50 కోట్లకు పైగా నెట్ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు విదేశీ మార్కెట్లలోనూ విజయ్ క్రేజ్ ఎక్కువ. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దూసుకుపోతుంది.
ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi: అతడిని డైరెక్టర్ చేయాలని సినిమా స్టార్ట్ చేశా.. ఎంతో ఫోర్స్ చేశా.. కానీ ఇప్పుడు పెద్ద నటుడు అయ్యాడు.. కృష్ణ వంశీ..
ఇక వరల్డ్ వైడ్ చూస్తే.. దాదాపు రూ.100 కోట్ల కలెక్షన్స్ రావడం ఖాయమని అంటున్నారు. ఇదే నిజమైతే.. విజయ్ కెరీర్ లో అత్యధిక వసూల్లు రాబట్టిన మొదటి సినిమా ఇదే అవుతుంది. ఇక సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన విజయ్.. ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల్లోకి పూర్తిగా అడుగుపెట్టిన తర్వాత విడుదలైన తొలి సినిమా కావడంతో దేశవ్యాప్తంగా ముందు నుంచి మంచి బజ్ నెలకొంది. ఇక ఈ సినిమాలోని టైటిల్ కార్డ్ సైతం ఎంతోమందిని ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో దూసుకుపోతుంది.
ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu : బిగ్ బాస్‌లో జబర్దస్త్ క్రేజీ బ్యూటీ.. ఆఫర్ రావడంపై స్పందించిన గ్లామరస్ క్వీన్.. ఏమన్నారంటే..
ఎక్కువ మంది చదివినవి : Aishwarya Rajesh: అతడంటే క్రష్ కాదు పిచ్చి ఇష్టం.. తన కోసం చాలా ట్రై చేశా.. కానీ అంతలోనే తిరిగిరాని లోకాలకు.. ఐశ్వర్య రాజేశ్..