Vijay Sethupathi : భారతదేశపు మొట్టమొదటి ఆఫ్-రోడ్ మడ్ రేస్ చిత్రం `మడ్డీ`. ప్రేక్షకులకు 4×4 వినూత్న సినిమా అనుభవాన్ని అందించేలా రూపొందిన ఈ చిత్రం ద్వారా డాక్టర్ ప్రగల్‌భల్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ మూవీ టైటిల్‌లోగో, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి రిలీజ్ చేశారు. కొద్దిమందికి మాత్రమే తెలిసిన ఆఫ్ రోడ్ రేసింగ్ క్రీడల గురించి సినిమాపరంగా ఎంతో రీసెర్చ్ చేసి ఈ చిత్రాన్ని రూపొందించారు. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి శాన్ లోకేష్ ఎడిటింగ్ భాద్యతలు స్వీకరించగా హాలీవుడ్ ఫేమ్ కె జి రతీష్ సినిమాటోగ్రఫీ అందించారు. భారతీయ సినిమాల్లో కొత్త దర్శకులు, నిర్మాతలు మునుపెన్నడూ చూడని ఆలోచనలతో ప్రత్యేకమైన ప్రయోగాలు చేస్తున్న ఈ తరుణంలో ఒక దర్శకుడు తన తొలి చిత్రం కోసం 4×4 ఆఫ్-రోడ్ రేసింగ్ ను ఎంచుకోవడం విశేషం.
భారతదేశం యొక్క మొదటి 4×4 మడ్ రేస్ చిత్రం ‘మడ్డీ’ చిత్రీకరణ ప్రస్తుతం చివరి దశలో ఉంది. మడ్ రేసింగ్ అనేది ఆఫ్-రోడ్ మోటర్‌స్పోర్ట్ లో ఒక భాగం. ఈ థీమ్ ఆధారంగా సినిమాలు రావడం చాలా అరుదు. ఈ బహుళ భాషా చిత్రానికి నూతన దర్శకుడు డాక్టర్ ప్రగభల్ దర్శకత్వం వహించగా పికె 7 క్రియేషన్స్ పతాకంపై ప్రేమ కృష్ణదాస్ నిర్మించారు. బురదలో సాగే రేసింగ్ తో సాహసోపేతమైన యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం ప్రేక్షకులకు అసమానమైన సినిమా అనుభవాన్ని అందిస్తుంది అనడంతో సందేహం లేదు. ప్రధాన పాత్రల కోసం అందరినీ కొత్త వారినే ఎంచుకున్నారు దర్శకుడు డాక్టర్ ప్రగభల్. తనకు చిన్నప్పటి నుండి రేసింగ్ పట్ల ఉన్న ప్రేమతో చాలాకాలంగా ఈ క్రీడతో సన్నిహిత అనుబంధాన్ని కొనసాగించాడు. ఆయన ఐదేళ్ల పరిశోధన ఫలితమే ఈ చిత్రం. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు డాక్టర్ ప్రగల్‌భల్ మాట్లాడుతూ – “కొత్త తరహా చిత్రాలను ఎంకరేజ్ చేయడంతో విజయ్ సేతుపతి గారు ఎప్పుడూ ముందుంటారు. ఆయన చేతులమీదుగా మా
మా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజవ్వడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా ప్రధానంగా రెండు వేర్వేరు జట్ల మధ్య శత్రుత్వం, ప్రతీకారం గురించి ఉన్నప్పటికీ ఫ్యామిలీ డ్రామా, హాస్యం, సాహసం ఇలా ప్రతి ఎమోషన్ ఈ మూవీలో ఉంటుంది. ఈ సినిమా కోసం రియల్ మడ్ రేసర్స్ బ్యాక్‌గ్రౌండ్ ప్లేయర్‌లుగా నటించారన్నారు. ఇక ఈ చిత్రంలో యువన్, రిధాన్ కృష్ణ, అనుషా సురేష్, అమిత్ శివదాస్ నాయర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న పోషించారు.
మరిన్ని ఇక్కడ చదవండి :