Tollywood: ఫిలిం ఈవెంట్స్‌లో సెలబ్రిటీల స్టైలింగ్‌కు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. తెర మీద హీరోయిక్‌గా కనిపించే స్టార్స్… డైరెక్ట్‌గా ఆడియన్స్ ముందుకు వచ్చేప్పుడు కూడా ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ను రీచ్ అయ్యే రేంజ్‌లోనే ఉంటుంది స్టార్స్ ఎటైర్. కానీ ఈ రూల్‌ను బ్రేక్ చేస్తున్నారు టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన తొలి పాన్ ఇండియా మూవీ లైగర్(Liger). డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్(Puri Jagannath) స్వయంగా నిర్మిస్తూ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ నిర్మాణ భాగస్వామి. ఇలాంటి బిగ్ కాంబో వర్క్ చేస్తున్న సినిమా కావటంతో ప్రమోషన్స్‌ను కూడా అదే రేంజ్‌లో ప్లాన్ చేసింది యూనిట్. రీసెంట్‌గా ట్రైలర్ రిలీజ్‌ను పండగల సెలబ్రేట్ చేసింది లైగర్ యూనిట్. ఒకే రోజు రెండు సిటీస్‌లో ట్రైలర్ లాంచ్ ప్రొగ్రామ్ చేశారు. ముంబైలో జరిగిన ఈవెంట్‌లో విజయ్‌దేవరకొండ లుక్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇంత భారీ ఈవెంట్‌కు జస్ట్ స్లిప్పర్స్‌తో అటెండ్ అయి షాక్ ఇచ్చారు రౌడీ.
ఈ స్టైలింగ్ విజయ్ దేవరకొండ ఛాయిసే అన్నారు ఆయన స్టైలిస్ట్ హర్మాన్ కౌర్. సినిమాలో రోడ్ సైడ్ కిడ్‌గా కనిపిస్తున్న విజయ్… స్టేజ్ మీద కూడా అలాంటి లుక్‌లోనే కనిపిస్తే బెటర్ అని ఫీల్ అయ్యారట. అందుకే కామన్ మ్యాన్‌లా కనిపించేందుకు సింపుల్ టీ షర్ట్, 200 రూపీస్ స్లిప్సర్స్‌తో లుక్ డిజైన్ చేశారు. రౌడీ హీరోగా సింపుల్‌గా కనిపించాలని ట్రై చేసినా… ఇదే ఇప్పుడు యూత్‌లో స్పెషల్ క్రేజ్‌గా మారింది. ఆల్రెడీ తన స్టైల్ స్టేట్మెంట్స్‌తో యూత్‌ను ఎట్రాక్ట్ చేస్తున్న విజయ్ దేవరకొండ… తాజాగా లైగర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌తో మరో స్టైలిష్ ట్రెండ్ సెట్ చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..