ఈ సినిమా నా దగ్గరకు రావడం ఒక అద్భుతం.. మనం ఏమేం దాటుకొని ఈరోజు ఇక్కడికి వచ్చాము: విజయ్ దేవరకొండ

టాలీవుడ్‌లో మోస్ట్ క్రేజీ ఆన్‌స్క్రీన్ జోడీల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాలతో ఈ జంటకు వచ్చిన క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. ఇప్పుడు చాలా కాలం తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన ‘రణబాలి’ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

ఈ సినిమా నా దగ్గరకు రావడం ఒక అద్భుతం.. మనం ఏమేం దాటుకొని ఈరోజు ఇక్కడికి వచ్చాము: విజయ్ దేవరకొండ
Vijay Devarakonda

Updated on: Oct 08, 2026 | 7:29 PM

రణబాలి చిత్రం ట్రైలర్ లాంచ్ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ తన ప్రసంగంతో ప్రేక్షకులను, అభిమానులను ఉర్రూతలూగించారు.  ఈ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. మనకి ఏ చరిత్ర తెలియకుండా ఉండాలి అని తెలియకుండా ఉంచాలనుకున్నారో, మనకి ఏ వీరుల పేర్లు తెలియకూడదనుకున్నారో, మనకి ఏ కథలు మన బుర్రకథల్లో, మన ఫోక్లోర్లో మనకి చెప్తూ మనం మర్చిపోకుండా ఉంచారో, ఆ చరిత్రని అక్టోబర్ 16న కరెక్ట్ చేసే ప్రయత్నం రణబాలి” అని అన్నారు. మరుగునపడిన వీరులను, వారి కథలను అతిపెద్ద స్క్రీన్ల మీద ప్రపంచం మొత్తం చూసేలా చేసే ప్రయత్నమే ఈ సినిమా అని తెలిపారు విజయ్. ఈ చిత్రం ప్రేక్షకులను ఆ ప్రపంచంలోకి తీసుకెళ్తుందని ఆయన గట్టిగా నమ్ముతున్నానని పేర్కొన్నారు.

దర్శకుడు రాహుల్ సంకృత్యన్ రచనపై విజయ్ దేవరకొండ ప్రశంసల వర్షం కురిపించారు. “రాహుల్ సూపర్బ్ రైటర్ అని నాకు తెలుసు. టాక్సీవాలా విన్నప్పుడే తనెంత మంచి రైటరో నాకు తెలుసు. కానీ ఈ కథ నాకు తీసుకొచ్చినప్పుడు ఐ బిలీవ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ స్క్రిప్ట్స్ ఆఫ్ దిస్ ఇయర్ ఇన్ తెలుగు సినిమా” అని అన్నారు. స్క్రిప్ట్‌లోని కథాంశం మాత్రమే కాకుండా, రణబాలి, జయమ్మ, హెక్టర్, మద్దిలేటి, సింగనమల వంటి పాత్రల చిత్రణ, కరువు వంటి సబ్జెక్ట్‌ను మన సంస్కృతి నుంచి మాస్ హీరోయిక్ వేలో ఎలా తీశారు అనేది తనను ఎంతగానో ఆకట్టుకుందని వెల్లడించారు విజయ్. కథలోని అనేక లేయర్‌లను డీల్ చేస్తూ, వాటన్నింటినీ ఒక పర్పస్‌కు ఎలా ముడిపెట్టారో అద్భుతంగా ఉందని కొనియాడారు.

ఈ సినిమా తన వద్దకు రావడం ఒక అద్భుతం అని, దీనిని డెస్టినీగా భావిస్తున్నానని విజయ్ పేర్కొన్నారు. రవి శంకర్ (మైత్రీ మూవీ మేకర్స్) ఈ స్క్రిప్ట్‌ను తనకు తీసుకొచ్చిన తీరును గుర్తుచేసుకుంటూ, గుర్రాలు, కత్తులు, హీరో నడిపే ఫైట్ సన్నివేశాలపై ఆయన చూపిన ఉత్సాహాన్ని వివరించారు. “నా ఫిల్మోగ్రఫీలో, రష్మిక ఫిల్మోగ్రఫీలో ఇది ఒక ఇంపార్టెంట్ ఫేజ్ గా మిగిలిపోతుందని, మా ఫిల్మోగ్రఫీలో ఇది ఒక హైలైట్లా మిగిలిపోతుందని నేను నమ్ముతున్నా” అని ధీమా వ్యక్తం చేశారు. ప్రేక్షకులందరూ అక్టోబర్ 16న తప్పకుండా సినిమా చూడాలని, మీ కుటుంబానికి, పిల్లలకు చూపించాలని విజయ్ దేవరకొండ విజ్ఞప్తి చేశారు. “మనం ఏమేం దాటుకొని ఈరోజు ఇక్కడికి వచ్చాము.? ఎట్లాంటి మనుషుల డీఎన్‌ఏ మనలో ఉంది.? మనోళ్ళు ఎట్లుండేటోళ్లు, మనం ఎట్లుండాలి అని ఒక పర్స్పెక్టివ్ 30, 35 ఏళ్లకే ఎట్లుండేటోళ్లు అప్పుడు అనే ఒక పర్స్పెక్టివ్ మనకి, మన పిల్లలకి” అని అన్నారు విజయ్. అయితే, ఈ చిత్రం కొంచెం హింసాత్మక కోణంలో ఉంటుందని, సర్టిఫికేషన్ ఆధారంగా పిల్లలకు చూపించాలని సూచించారు. రణబాలి చిత్రంలో జయమ్మ పాత్రలో నటించిన రష్మిక మందన్న కార్యక్రమానికి హాజరు కాలేదు. ఆమె తరపున విజయ్ దేవరకొండ క్షమాపణలు తెలిపారు. కార్యక్రమం చివరలో, ప్రేక్షకుల కోరిక మేరకు “సింగనమల బొబ్బిలి రణబాలిరా నీ యక్క” అనే డైలాగ్‌ను చెప్పి అభిమానులను అలరించారు విజయ్. అలాగే సోషల్ మీడియా నెగిటివ్ క్యాంపైన్ మీద విజయ్ దేవరకొండ మాట్లాడారు. నెగిటివ్ క్యాంపైనింగ్ అనేది 90 పర్సెంట్ కొన్ని గ్రూపులు ఉంటాయి.. 50 మంది కూర్చుని 20 గ్రూపులుగా విడిపోయి 1000 మంది బ్యాచ్‌లా విడిపోయి సోషల్ మీడియాలో నెగిటివ్ చేస్తుంటారు.. 50 రీల్స్ ఒకేలా వస్తున్నాయంటే ఎవడో డబ్బులు పెట్టి కూర్చుని చేయిస్తున్నాడని అర్థం.. నెక్ట్స్ ఆర్నెళ్లలో వీళ్ళు చేసే పని AI చేస్తుంది.. డబ్బులు పెట్టేవాడు మాత్రం AIకి ఇచ్చేస్తాడు.. అప్పుడు వీళ్ళ పరిస్థితేంటో..? కిందకి లాగడానికి వాడుతున్నపుడు మనమేం చేయలేం.. పనికిమాలిన పనులు ఎందుకు అనిపిస్తుంది.. నేనే కాదు మొన్న ఇదే టాపిక్ మీద నాని అన్న.. కిరణ్ అబ్బవరం.. సందీప్ కిషన్ మాట్లాడారు.. 7 ఇయర్స్ నుంచి అర్థం కాలేదు.. 1 ఇయర్ నుంచే క్లారిటీ వచ్చింది.. అప్పుడే మనశ్శాంతి దొరికింది అని విజయ్ అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us