Vijay Deverakonda: రీమేక్స్ చేయడం అస్సలు ఇష్టముండదంటున్న విజయ్ దేవరకొండ.. కాస్త పోలిక ఉన్న చేసేది లేదంటూ..

తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో లైగర్ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇప్పటికే దేశంలోని ప్రధాన నగరాల్లో లైగర్ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు మేకర్స్

Vijay Deverakonda: రీమేక్స్ చేయడం అస్సలు ఇష్టముండదంటున్న విజయ్ దేవరకొండ.. కాస్త పోలిక ఉన్న చేసేది లేదంటూ..
Vijay Deverakonda
Follow us

|

Updated on: Aug 16, 2022 | 9:27 AM

లైగర్ (Liger) చిత్రం కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తికగా ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ పూరి జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కాంబోలో రాబోతున్న ఈసినిమా పై ఇప్పటికే భారీగా అంచానాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంతో పాన్ ఇండియా స్టార్‏గా క్రేజ్ సంపాదించుకున్నారు విజయ్. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ హైప్ క్రియేట్ చేశాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా కరణ్ జోహార్, ఛార్మి, పూరి నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో లైగర్ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇప్పటికే దేశంలోని ప్రధాన నగరాల్లో లైగర్ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో తాజాగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు విజయ్. తనకు రీమేక్స్ చేయడం అస్సలు ఇష్టముండదని.. ఇతర సినిమాలతో కాస్త పోలిక ఉన్న చేయనంటూ చెప్పుకొచ్చారు.

మొదటిసారి లైగర్ కథ విన్నప్పుడు దేశమొత్తం ఈ స్టోరీ చెప్పొచ్చు అనిపించింది. లోకల్ సినిమాని నేషనల్ కి తీసుకెళ్ల ప్రయత్నం విజయవంతంగా జరుగుతున్న తరుణంలో లైగర్ కంటెంట్ కూడా జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లడం జరిగింది. లైగర్ నా కెరీర్ లో బిగ్గెస్ట్ సినిమా. అలాగే ఫిజికల్ గా కూడా ఎక్కువ కష్టపడిన సినిమా కూడా ఇదే. బాడీని ట్రాన్ ఫార్మ్ చేయడానికి ఏడాదిన్నర కాలం పట్టింది. ఫెర్ఫార్మెన్స్ వైజ్ కూడా సవాల్ తో కూడున్న సినిమా. ఫైట్స్ నేర్చుకోవడం, అలాగే డ్యాన్స్ కూడా. పూరి గారు ప్లే చేయడానికి అద్భుతమైన కంటెంట్ ఇచ్చారు. ఈ సినిమా కోసం సర్వస్వం ఇచ్చేశా అని అన్నారు విజయ్.

అలాగే ఈ సినిమా అమ్మనాన్న ఓ తమిళమ్మాయి సినిమా సిక్వెల్‏గా రాబోతుందంటూ వస్తున్న వార్తలపై విజయ్ స్పందించారు. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి చిత్రం చాలా సార్లు చూశాను. రీమేకులు ఫ్రీమేకులు నాకు ఇష్టం వుండదు. ఆ సినిమా కథతో కొంచెం పోలిక వున్న నేను చేయను కదా. పైగా లైగర్ లో వున్నది బాక్సింగ్ కాదు. ఎంఎంఎ అనే మార్షల్ ఆర్ట్స్. అమ్మా నాన్న తమిళమ్మాయితో లైగర్ కి ఎలాంటి పోలిక లేదు. ఈ సినిమాలో అన్నటికంటే మజా నత్తి వల్లే వస్తుంది. దాని నుండి వచ్చిన డ్రామా హై చాలా ఇంటరెస్టింగా వుంటుంది. నత్తి పాత్ర చేయడానికి మొదట మూడురోజులు కాస్త కష్టపడ్డా. తర్వాత ఆ పాత్రతో ఒక కనెక్షన్ వచ్చేసింది. ఈ పాత్ర ఎంత నచ్చిందంటే..ఇప్పుడు నాకు నత్తి లేకుండా మాట్లాడటం నచ్చడం లేదు. లైగర్ పాత్రని చాలా మిస్ అవుతున్నాను అని అన్నారు. మార్సల్ ఆర్ట్స్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా కనిపించనుండగా.. అనన్య పాండే హీరోయిన్ గా.. రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలకపాత్రలలో నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.