Vijay Deverakonda : విజయ్ దేవరకొండ గుండెలపై కాలు పెట్టిన హీరోయిన్.. రౌడీ జనార్దన్ నుంచి పోస్టర్ రిలీజ్..

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఈరోజు ఈ హీరో పుట్టినరోజు.. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు, అభిమానులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. మరోవైపు విజయ్ అప్ కమింగ్ మూవీస్ నుంచి క్రేజీ అప్డేట్స్ రివీల్ చేస్తున్నారు మేకర్స్.

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ గుండెలపై కాలు పెట్టిన హీరోయిన్.. రౌడీ జనార్దన్ నుంచి పోస్టర్ రిలీజ్..
Vijay Deverakonda Poster

Updated on: May 09, 2026 | 1:59 PM

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్, ‘రౌడీ’ విజయ్ దేవరకొండ పుట్టినరోజు (మే 9) వేడుకలు సోషల్ మీడియాలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తదుపరి చిత్రాల నుంచి వరుస అప్‌డేట్స్ వస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నాయి. ఇందులో భాగంగా, విజయ్ దేవరకొండ హీరోగా రవి కిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ నుంచి ‘రౌడీ జనార్ధన’ స్పెషల్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర పేరు ‘రౌడీ జనార్ధన’ అని చిత్ర బృందం ప్రకటించింది. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో విజయ్ లుక్ ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంది. గడ్డం పెంచి, మెడలో చైన్ తో, ఒక చేతిలో తుపాకి పట్టుకుని ఉన్న విజయ్ మేకోవర్ చూస్తుంటే, ఈ సినిమా పక్కా గ్రామీణ నేపథ్యం కలిగిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని అర్థమవుతోంది.

ఎక్కువ మంది చదివినవి : Jaya Prada : నటనకే నటన నేర్పిన మహా నటుడు అతడు.. అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. హీరోయిన్ జయప్రద..

“అనుకున్నది సాధించే వరకు నిద్రపోని రౌడీ జనార్ధన” అనే క్యాప్షన్ ఈ పాత్రను తెలియజేస్తోంది. రాజా వారు రాణి గారు’ ఫేమ్ రవి కిరణ్ కోలా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ కెరీర్‌లో ఇది 14వ చిత్రం (VD14). ఇప్పటికే ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. గ్రామీణ రాజకీయాలు లేదా పీరియడ్ డ్రామా నేపథ్యంలో ఈ కథ సాగవచ్చని తెలుస్తోంది. ఇందులో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : Vijay Thalapathy : ఆ ఒక్క సినిమా విడుదల కాకపోయి ఉంటే విజయ్, సంగీత పెళ్లి అయ్యేదే కాదు.. తలపతి కెరీర్ మార్చిన ఏకైక మూవీ..

విజయ్ దేవరకొండ పుట్టినరోజు కావడంతో ‘రౌడీ జనార్ధన’ పోస్టర్ ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. ‘ఖుషి’, ‘ఫ్యామిలీ స్టార్’ వంటి సినిమాల తర్వాత విజయ్ మళ్లీ కంప్లీట్ మాస్ అండ్ యాక్షన్ రోల్ చేస్తుండటంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. కేవలం ఈ సినిమానే కాకుండా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న VD12 నుంచి కూడా అప్‌డేట్స్ రావడంతో సోషల్ మీడియా అంతా రౌడీ నామస్మరణతో మారుమోగిపోతోంది.

ఎక్కువ మంది చదివినవి : Raghavendra Rao: 83 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‏గా.. ఆరోగ్యంగా.. రోజూ ఉదయాన్నే తినేది ఇవే.. రాఘవేంద్రరావు..

ఎక్కువ మంది చదివినవి : Meena : తెలుగు సినిమాల్లో నాకు గుర్తింపు రావడానికి ఆ హీరోనే కారణం.. లేదంటే నేను లేను.. మీనా కామెంట్స్..

Loading...
Unable to load recommendations.
Follow Us