Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ ట్వీట్‌కు పగలబడి నవ్విన సమంత.. అసలేం జరిగిందంటే..

Vijay Devarakonda: పుష్ప (Pushpa) సినిమాలో స్పెషల్‌ సాంగ్‌తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన నటి సమంత (Samantha) ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే శాకుంతలం, యశోద సినిమాలను...

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ ట్వీట్‌కు పగలబడి నవ్విన సమంత.. అసలేం జరిగిందంటే..

Updated on: Apr 22, 2022 | 3:14 PM

Vijay Devarakonda: పుష్ప (Pushpa) సినిమాలో స్పెషల్‌ సాంగ్‌తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన నటి సమంత (Samantha) ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే శాకుంతలం, యశోద సినిమాలను పూర్తిచేసే పనిలో పడ్డ సామ్‌ తాజాగా రౌడీ హీరో విజయ్‌ దేవరకొండతో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘ఖుషీ’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా సినిమా షూటింగ్‌ను అధికారికంగా ప్రారంభించారు.

గురువారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమం ద్వారా సినిమాను ప్రారంభించారు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ తెరకెక్కిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా పూజా కార్యక్రమానికి నటి సమంత హాజరుకాకపోవడంతో ఈ వార్త నెట్టింట తెగ వైరల్‌గా మారింది. సమంత ఎందుకు హాజరుకాలేదంటూ సోషల్‌ మీడియా కోడై కూసింది. ఈ నేపథ్యంలో విజయ్‌ దేవరకొండ సినిమాలో నటిస్తోన్న సమంత, వెన్నెల కిషోర్‌, రాహుల్‌ రామకృష్ణలను గ్రాఫిక్స్‌లో జత చేసి ఓ ఫోటోను ట్వీట్ చేశాడు.

ఈ ఫోటోతో పాటు.. ‘సినిమా పూజకు సంబంధించి నిజమైన ఫొటో ఇదే. ఈ ఫొటోను ప్రచురించాల్సిందిగా మీడియాకు నా రిక్వెస్ట్‌’ అంటూ సమంత, వెన్నెల కిషోర్‌, రాహుల్‌ రామకృష్ణలను ట్యాగ్‌ చేశాడు. దీంతో ఈ ట్వీట్‌కు స్పందించిన సమంత స్మైలీ ఎమోజీని జత చేస్తూ రీట్వీట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్‌ కాస్త వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే సమంత ప్రస్తుతం దుబాయ్‌ వెకేషన్‌లో ఉన్న కారణంగా పూజా కార్యక్రమానికి హాజరుకాలేకపోయింది. త్వరలోనే సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌లో పాల్గొననుంది సామ్‌.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Also Read: Viral Video: దారి తప్పిన తాబేలుకు మానవ సహాయం.. మనసు దోచేస్తున్న వీడియో

Tollywood : మాస్ దర్శకులంతా తమ సినిమాల్లో ఈ ఎలిమెంట్స్‌ ఎలా మిస్ అవుతున్నారబ్బా.!!

Ukraine love story: ఉక్రెయిన్‌ అమ్మాయికి.. ఢిల్లీ అబ్బాయికి ప్రేమ పెళ్ళి! వచ్చేప్పుడు ఆమె తెచ్చిన వస్తువులు..

Loading...
Unable to load recommendations.
Follow Us