Samantha: ఆమె ఓ అద్భుతం.. సమంతపై విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

|

Jul 29, 2022 | 5:19 PM

Vijay Devarakonda: ఇండియాలో ఎక్కువ మంది ఇష్టపడే మహిళ ఎవరు అని అడగ్గా.. ఠక్కున సమంత పేరు చేప్పేశాడు విజయ్

Samantha: ఆమె ఓ అద్భుతం.. సమంతపై విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Vijay Devarakonda
Follow us on

రౌడీ హీరో విజయ్ (Vijay Devarakonda) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లైగర్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు విజయ్. ఆగస్ట్ 25న విడుదల కాబోతున్న ఈ మూవీ పై అంచానాలు భారీగానే ఉన్నాయి. లైగర్ ప్రమోషన్లలో భాగంగా హీరోయిన్ అనన్యతో కలిసి కాఫీ విత్ కరణ్ షోలో పాల్గోన్నాడు విజయ్. ఈ షోలో తన స్టైల్లో బోల్డ్ ప్రశ్నలతో విజయ్, అనన్యలను ఓ ఆటాడుకున్నారు కరణ్. అలాగే ఇండస్ట్రీలో తనకు రష్మిక మంచి స్నేహితురాలు అని.. ఇద్దరం కలిసి రెండు సినిమాలు చేశాము. జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకుల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం. తను నా డార్లింగ్ అని తెలిపాడు విజయ్.

అలాగే ఈ షోలో ర్యాపిడ్ రౌండ్‏లో భాగంగా.. ఇండియాలో ఎక్కువ మంది ఇష్టపడే మహిళ ఎవరు అని అడగ్గా.. ఠక్కున సమంత పేరు చేప్పేశాడు విజయ్. సమంత అందమైన అమ్మాయి అని.. తను ఓ అద్భుతం అంటూ చెప్పుకొచ్చారు. అలాగే జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ ల గురించి అడగ్గా.. జాన్వీ క్యూట్‏ అని.. అలాగే సారా అలీ ఖాన్ విట్టీ అండ్ ఫన్నీ అని తెలిపాడు. విజయ్ దేవరకొండ, సమంత కాంబోలో ఖుషి సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.