
vijay devarakonda: టాలీవుడ్ క్రేజీ దేవరకొండ ఓవర్ నైట్ లో స్టార్ అయిన విషయం తెలిసిందే. పెళ్ళిచూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనం సృష్టించాడు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆతర్వాత విజయ్ యాటిట్యూడ్ కు యువత మొత్తం ఫిదా అయ్యారు. ఇక విజయ్ కు భారీ ఫాలోయింగ్ ఉంది. ఇటీవల విజయ్ అభిమాని అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న విజయ్ ఫోన్ లో వీడియో కాల్ ద్వారా పలకరించాడు. హేమంత్ అనే అభిమాని అనారోగ్యంతో బాధపడుతూ విజయ్ తో మాట్లాడాలనుకున్నాడు అనుకున్నాడు. దాంతో హేమంత్ తో విజయ్ మాట్లాడాడు. ఆ సమయంలో హేమంత్ చాలా సంతోషం వ్యక్తం చేశాడు. నీతో మాట్లాడిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది.. ఎలాంటి ఆందోళన నాకు లేదు అంటూ చెప్పుకొచ్చాడు విజయ్.
తాజాగా ఆరోగ్యం క్షీణించంతో హేమంత్ మృతి చెందాడు. దాంతో విజయ్ దేవరకొండ ట్విట్టర్ ద్వారా తన బాధను షేర్ చేసుకున్నాడు. ఐ మిస్ యు హేమంత్… నీతో మాట్లాడటం నాకు ఆనందంను కలిగించింది… నీతో మాట్లాడిని ఆ సమయంలో నీ నవ్వు చూసి, నీ ప్రేమ చూసి గొప్పగా అనిపించింది. కాని ఇప్పుడు మాత్రం నా కళ్లలో నీళ్లు వస్తున్నాయి. నీవు లేని విషయం చాలా బాధను కలిగిస్తుంది. హేమంత్ నాతో కాంటాక్ట్ అయ్యేలా చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశాడు విజయ్.
మరిన్ని ఇక్కడ చదవండి :