Vijay Devarakonda TNR: టీఎన్ఆర్ మృతిపై భావోద్వేగానికి గురైన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. మిస్ అవుతున్నానంటూ..

Vijay Devarakonda On TNR Death: ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో సోష‌ల్ మీడియా ఓపెన్ చెయ్యాలంటే భ‌యామేసే ప‌రిస్థితి నెల‌కొంది. ఎప్పుడు ఎవ‌రి మ‌ర‌ణ వార్త వినాల్సి వ‌స్తుందో అని. ఎవ‌రి స్టేట‌స్ చూడాల‌న్నా....

Vijay Devarakonda TNR: టీఎన్ఆర్ మృతిపై భావోద్వేగానికి గురైన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. మిస్ అవుతున్నానంటూ..
Vijay On Tnr Death

Updated on: May 10, 2021 | 2:52 PM

Vijay Devarakonda On TNR Death: ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో సోష‌ల్ మీడియా ఓపెన్ చెయ్యాలంటే భ‌యామేసే ప‌రిస్థితి నెల‌కొంది. ఎప్పుడు ఎవ‌రి మ‌ర‌ణ వార్త వినాల్సి వ‌స్తుందో అని. ఎవ‌రి స్టేట‌స్ చూడాల‌న్నా.. ఆందోళ‌న‌గా ఉంది రెస్ట్ ఇన్ పీస్ అంటూ ఎవ‌రి ఫొటో పెడ‌తారో అని.. అంతలా క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌కు గురి చేస్తోంది. ఇక అంద‌రికి తెలిసిన సెల‌బ్రిటీల మ‌ర‌ణాలు స‌మాజాన్ని క‌లిచి వేస్తున్నాయి. తాజాగా ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్, న‌టుడు టీఎన్ఆర్‌ మ‌ర‌ణం అంద‌రినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. సోష‌ల్ మీడియా మీద క‌నీస అవ‌గాహ‌న ఉన్న ఎవరికైనా టీఎన్ఆర్ పేరును ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. ఫ్రాంక్లీ విత్ టీఎన్ఆర్ పేరుతో ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హిస్తూ ఎంతో మందికి చేరువయ్యారు.
ఇక ఈయ‌న మృతిపై యావ‌త్ సినీ ప్ర‌పంచం సంతాపం తెలుపుతోంది. తాజాగా న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ టీఎన్ఆర్ మృతిపై ఆవేద‌న వ్య‌క్తం చేస్తారు. ఈ క్ర‌మంలోనే ట్విట్ట‌ర్ వేదిక‌గా భావోద్వేగ పోస్ట్ చేశాడు విజ‌య్‌. హైద‌రాబాద్‌లోని ఓ ఆసుప‌త్రిలో చిక్సిత పొందుతూ సోమ‌వారం ఉద‌యం మ‌ర‌ణించిన టీఎన్ఆర్ మృతిపై స్పందించిన విజ‌య్‌.. మీ గురించే ఆలోచిస్తున్నాను. మీతో చేసిన సుధీర్ఘ ఇంట‌ర్వ్యూ గుర్తుకొస్తుంది. వృత్తిపై మీకున్న నిజ‌మైన నిబద్ధ‌త, ప్రేమ చాలా గొప్ప‌వి. మీ మ‌ర‌ణ వార్త న‌న్ను ఎంతో క‌లిచి వేసింది. మిమ్మ‌ల్ని ఎంత‌గానో మిస్ అవుతున్నా స‌ర్ అంటూ ట్వీట్ చేశాడు. ఇదిలా ఉంటే అర్జున్ రెడ్డి సినిమా త‌ర్వాత విజ‌య్‌తో క‌లిసి టీఎన్ఆర్ ఓ ఇంట‌ర్వ్యూ చేసిన విష‌యం తెలిసిందే.

విజ‌య్ చేసిన ట్వీట్‌..

 

Also Read: Telangana Curfew: కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే కటకటాలే.. తెలంగాణ పోలీసుల సీరియ‌స్ వార్నింగ్

కంగనాకు మరోసారి దెబ్బ.. ఆమె పెట్టిన పోస్ట్‏ను డెలీట్ చేసిన ఇన్‏స్టాగ్రామ్.. ఇంతకీ ఈ బాలీవుడ్ బ్యూటీ ఏం రాసిందంటే..

లైవ్‏లో వాట్సప్ నంబర్ అడిగిన నెటిజన్.. మరోసారి తన స్టైల్లో సమాధానం చెప్పిన సింగర్ సునీత..

Loading...
Unable to load recommendations.
Follow Us