రానా చేతులమీదుగా రాజ్ తరుణ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్.. `పవర్ ప్లే`గా రానున్న యంగ్ హీరో

యంగ్ హీరో రాజ్ త‌రుణ్, కొండా విజ‌య్ కుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న లేటెస్ట్ మూవీ `పవర్ ప్లే`. శ్రీ‌మ‌తి ప‌ద్మ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌న‌మాలి క్రియేష‌న్స్ ప్రై.లి ప‌తాకంపై..

  • Rajeev Rayala
  • Publish Date - 7:30 pm, Thu, 14 January 21
రానా చేతులమీదుగా రాజ్ తరుణ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్.. `పవర్ ప్లే`గా రానున్న యంగ్ హీరో

యంగ్ హీరో రాజ్ త‌రుణ్, కొండా విజ‌య్ కుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న లేటెస్ట్ మూవీ `పవర్ ప్లే`. శ్రీ‌మ‌తి ప‌ద్మ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌న‌మాలి క్రియేష‌న్స్ ప్రై.లి ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని మ‌హిద‌ర్‌, దేవేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి సంద‌ర్భంగా ఈ మూవీ ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ని  హీరో రానా ద‌గ్గుబాటి విడుద‌ల చేసి టీమ్ అంద‌రికీ విషెస్ తెలిపారు.

ఈ సందర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు విజ‌య్ కుమార్ కొండా మాట్లాడుతూ..“మా `పవర్ ప్లే` మూవీ ఫ‌స్ట్‌లుక్, మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్ చేసిన రానా కి ద‌న్య‌వాదాలు. పోస్ట‌ర్ లో రాజ్ త‌రుణ్ లుక్ ఎలా డిఫ‌రెంట్‌గా ఉందో.. సినిమా కూడా అలా డిఫ‌రెంట్‌గా ఉంటుంది. నేను, రాజ్ త‌రుణ్ ఇంత‌వ‌ర‌కూ చేయ‌ని ఒక కొత్త జోన‌ర్‌లో భిన్న‌మైన థ్రిల్ల‌ర్‌గా ఈ మూవీ ఉంటుంది. “ అన్నారు.  హీరో రాజ్ త‌రుణ్ మాట్లాడుతూ – “విజ‌య్ కుమార్ గారితో `ఒరేయ్ బుజ్జిగా..` లాంటి మంచి ఎంట‌ర్‌టైన‌ర్ చేశాను. ఆ సినిమా మంచి హిట్ అయ్యింది. ఇప్పుడు ఒక స‌రికొత్త జోన‌ర్‌లో డిఫ‌రెంట్ థ్రిల్ల‌ర్ స‌బ్జెక్ట్ చేస్తున్నాను. నాకు ఇదొక కొత్త ఎక్స్‌పీరియ‌న్స్‌. ఆడియ‌న్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది“ అన్నారు.