ప్రముఖ హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా దీనికి చికిత్స తీసుకుంటోన్న సామ్ ఇటీవలే ఈ విషయాన్ని బయటపెట్టింది. దీంతో టాలీవుడ్ మొత్తం షాకైంది. సెలబ్రిటీలు, అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. పడిలేచిన కెరటంలా ఆమె తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి సైతం ‘డియర్ సామ్.. నువ్వు చాలా స్ట్రాంగ్, త్వరగా కోలుకుంటావని ఆశిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్, అక్కినేని అఖిల్, సుశాంత్, మెగా బ్రదర్ నాగబాబు, శ్రియా, రాశిఖన్నా, సుస్మిత కొణిదెల, జాన్వీకపూర్, కియారా అద్వానీ, జెనీలియా, హన్సిక, మంచులక్ష్మి, ప్రగ్యాజైస్వాల్, కృతిసనన్, విమలారామన్ తదితరులు సామ్‌కు అండగా నిలిచారు. ధైర్యంగా ఉండాలి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ లవ్ అండ్ హార్ట్ ఎమోజీలతో సామ్ పోస్టుకు కామెంట్లు పెట్టారు. తాజాగా హీరో వెంకటేశ్ కూతురు అశ్రిత దగ్గుబాటి సమంత అనారోగ్యంపై స్పందించింది. ‘నీలో నీకు తెలియనంతా గొప్ప శక్తి ఉంది.. నీ కోసం అనంతమైన ప్రేమను పంపుతున్నాను’ అంటూ ఆశ్రిత తెలిపింది.
కాగా అక్కినేని కుటుంబానికి చెందిన అఖిల్, సుశాంత్ సామ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ‘ ప్రపంచంలోని శక్తి, సత్తా, ప్రేమ అంతా కూడా నీకు రావాలి డియర్ సామ్ అంటూ రెడ్ హార్ట్ సింబల్‌ను షేర్ చేశాడు అఖిల్. ఇక సుశాంత్ అయితే ‘ ఈ ప్రపంచంలోని శక్తి, బలం అంతా నీదరికి చేరాలి.. నువ్ దీన్ని అధిగమించగలవ్ సామ్’ అని అండగా నిలిచాడు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.