Varsha Bollamma: కుందనపుబొమ్మలా మెరిసిన వర్ష బొల్లమ్మ.. అమ్మాయి డ్రస్ ధర ఎంతో తెలుసా..?

|

Dec 06, 2022 | 3:42 PM

రీసెంట్గా బెల్లంకొండ సురేష్ చిన్న కోడుకు గణేష్ బాబు హీరోగా పరిచయమైన స్వాతిముత్యం సినిమాలో నటించింది వర్ష.

Varsha Bollamma: కుందనపుబొమ్మలా మెరిసిన వర్ష బొల్లమ్మ.. అమ్మాయి డ్రస్ ధర ఎంతో తెలుసా..?
Varsha Bollamma
Follow us on

దళపతి విజయ్ నటించిన విజిల్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది వర్ష బొల్లమ్మ. ఈ సినిమాలో ఫుట్ బాల్ ప్లేయర్ గా నటించింది వర్ష. ఈ సినిమా తర్వత పలు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగులో చిన్న హీరోలకు జోడీగా  నటి స్తుంది ఈ భామ. రీసెంట్గా బెల్లంకొండ సురేష్ చిన్న కోడుకు గణేష్ బాబు హీరోగా పరిచయమైన స్వాతిముత్యం సినిమాలో నటించింది వర్ష. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ వర్ష అందానికి, క్యూట్ నెస్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ అమ్మడు ఇప్పుడు వరుస ఆ సినిమాలతో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తాజాగా కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. ఈ ఫొటోల్లో వర్ష చాలా అందంగా కనిపించింది. ఇక ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతుండటంతో కుర్రాళ్ళు కొంటె కామెంట్లు పెడుతున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు వేసుకున్న డ్రస్ పై సర్వత్ర చర్చ జరుగుతోంది. వైలెట్ కలర్ డ్రస్ లో బుట్టబొమ్మలా ఉంది వర్ష. దాంతో ఈ డ్రస్ ధర తెలుసుకునే పనిలో పడ్డారు నెటిజన్లు. వర్ష బొల్లమ్మ ధరించిన డ్రెస్ ఖరీదు అక్షరాలా 9500 రూపాయలు అని తెలుస్తోంది. జైరా బ్రాండ్ కు చెందిన డ్రెస్ ధరించిన వర్ష చాలా ముద్దుగా కనిపిస్తోంది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోంది వర్ష. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఒకొక్క సినిమాకు కోటిరూపాయలు రెమ్యునరేషన్ అందుకుంటుందని టాక్.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.