Pawan Kalyan: మహేష్ డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ సినిమా.. దిల్ రాజు ప్లాన్ అదుర్స్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ళ తర్వాత వెండితెరపై తిరిగి సందడి చేశారు. వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇచిన పవన్ సూపర్ హిట్ ను అందుకున్నారు.

 Pawan Kalyan: మహేష్ డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ సినిమా.. దిల్ రాజు ప్లాన్ అదుర్స్..
pawan-kalyan

Updated on: Apr 25, 2021 | 6:11 AM

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ళ తర్వాత వెండితెరపై తిరిగి సందడి చేశారు. వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇచిన పవన్ సూపర్ హిట్ ను అందుకున్నారు. బాలీవుడ్ లో మంచి విజయం సాధించిన పింక్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. దిల్ రాజు బోనికపూర్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు, వేణు శ్రీరామ్  వకీల్ సాబ్ కు దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదలైన మొదటి రోజునుంచే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా నిర్మించిన దిల్ రాజు పవన్ కళ్యాణ్ తో మరో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విషయాన్న్ని ఇటీవల ఆయనే స్వయంగా వెల్లడించారు. అయితే పవన్ ను డైరెక్ట్ చేయబోయే దర్శకుడు ఎవ్వరు అనే దాని పైన మాత్రం ఇంతవరకు ఎలాంటి వార్తలు రాలేదు. అయితే తాజాగా పవన్  దిల్ రాజు సినిమాను డైరెక్ట్ చేయబోయేది ఇతడే అంటూ ఓ వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతుంది.

ఈ సినిమా బాధ్యతలను దిల్ రాజు వంశీ పైడిపల్లి చేతిలో పెట్టనున్నారని అంటున్నారు. దిల్ రాజు బ్యానర్ లో ‘మున్నా’ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వంశీ పైడిపల్లి.. ఆ తర్వాత ‘బృందావనం’ ‘ఎవడు’ ‘మహర్షి’ వంటి సినిమాలను దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ లో తెరకెక్కించాడు. ఇక మహర్షి సినిమా నేషనల్ అవార్డు మును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే మహర్షి సినిమా తర్వాత వంశీ ఎవరితోనూ సినిమాను కమిట్ అవ్వలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాని డైరెక్ట్ చేసే అవకాశం వంశీ పైడిపల్లి కి ఇచ్చారని టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై దిల్ రాజు – వంశీ పైడిపల్లి ఇద్దరూ పవన్ ని  కలిసారని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Hari Teja: పెళ్లి రోజున త‌న చిన్నారిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసిన హ‌రితేజ‌.. భ‌ర్త‌, కూతురుతో క‌లిసి దిగిన‌..

కరోనా నుంచి కోలుకున్న రియల్ హీరో.. నెగిటివ్ అంటూ పాజిటివ్‏ షేడ్‏లో చెప్పిన సోనూ సూద్..

Anupama: త‌న‌ విస్కీ బేబీకి నాలుగేళ్లు నిండిన సంద‌ర్భంగా.. ఎమోష‌న‌ల్ పోస్ట్ చేసిన అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌..

Loading...
Unable to load recommendations.
Follow Us