Vamshi Paidipally: ఇద్దరు స్టార్ హీరోలను హ్యాండిల్ చేయడం అంటే సాహసమనే చెప్పాలి…!

2019లో మహర్షి సినిమాతో ఆడియన్స్‌ ముందుకు వచ్చిన వంశీ పైడిపల్లి... ఇంత వరకు మరో సినిమా చేయలేదు. మహర్షి ప్రమోషన్‌ టైంలోనే మహేష్ బాబుతో

Vamshi Paidipally: ఇద్దరు స్టార్ హీరోలను హ్యాండిల్ చేయడం అంటే సాహసమనే చెప్పాలి...!

Updated on: May 08, 2021 | 8:25 AM

Vamshi Paidipally: 2019లో మహర్షి సినిమాతో ఆడియన్స్‌ ముందుకు వచ్చిన వంశీ పైడిపల్లి… ఇంత వరకు మరో సినిమా చేయలేదు. మహర్షి ప్రమోషన్‌ టైంలోనే మహేష్ బాబుతో నెక్ట్స్ సినిమా అన్న ఎనౌన్స్‌మెంట్ వచ్చినా…. ఆ ప్రాజెక్ట్ కూడా కాన్సిల్ అయ్యింది. తాజాగా వంశీతో సినిమా అంటూ ఇద్దరు టాప్ హీరోల పేర్లు తెర మీదకు వచ్చాయి.

కోలీవుడ్ టాప్ స్టార్‌ విజయ్‌ హీరోగా వంశీ పైడిపల్లి ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారన్న న్యూస్‌ గత వారం రోజులుగా తెగ వైరల్ అవుతోంది. ప్రజెంట్ నెల్సన్ దిలీప్‌ తో సినిమా చేస్తున్న విజయ్‌.. నెక్ట్స్ వంశీ పైడిపల్లితో మల్టీ లింగ్యువల్ మూవీకి ప్లాన్ చేస్తున్నారన్నది నిన్న మొన్నటి వరకు వినిపించిన అప్‌డేట్‌.. ఇప్పుడు ఈ న్యూస్‌కు కొనసాగింపుగా మరో న్యూస్ వైరల్ అవుతోంది.

పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్‌ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతుందట. ఈ న్యూస్‌ కొత్త డిస్కషన్ మొదలైంది. తమిళ్‌లో విజయ్‌కు ఎలాంటి ఇమేజ్‌, ఫాలోయింగ్ ఉందో.. తెలుగులో పవన్‌కు కూడా సేమ్ ఇమేజ్‌, ఫాలోయింగ్ ఉంటుంది. అందుకే ఒకే సినిమాను ప్యారలల్‌గా ఇద్దరు హీరోలతో రెండు భాషల్లో చేస్తున్నారా అన్న డౌట్స్ రెయిజ్ చేస్తున్నారు ఫ్యాన్స్‌. మరో వైపు ఇద్దరు స్టార్ హీరోలు… ఇద్దరికీ విపరీతమైన క్రేజ్ ఉంది… ఒకే కథను రెండు చోట్ల అక్కడి నేటివిటీకి తగ్గట్టుగా తెరకెక్కించాలి. మరి వంశీ ఈ ఇద్దరు స్టార్ హీరోలను ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Mamatha Mohandas: చాలా కాలం తరువాత తిరిగి సినిమాలతో బిజీ అవ్వాలని చూస్తున్న ముద్దుగుమ్మ..

Nagarjuna: మరో బాలీవుడ్ బ్యూటీతో రొమాన్స్ చేయనున్న మన్మధుడు.. బంగార్రాజు కోసం ఆ భామ..

Vijay Devarakonda: తెలంగాణ ప్ర‌భుత్వంతో చేతులు క‌లిపిన విజ‌య్‌.. క‌రోనాపై అవ‌గాహ‌న క‌ల్పిస్తోన్న రౌడీ హీరో..

Follow Us