Uppena Deleted Scenes: ఆకట్టుకుంటున్న ఉప్పెన డిలీట్ సీన్స్.. బెబ్బమ్మ కోసం ఆశీ ప్రయత్నాలు

అందమైన ప్రేమ కథతో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా ఉప్పెన. మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ ఇది.

Uppena Deleted Scenes:  ఆకట్టుకుంటున్న ఉప్పెన డిలీట్ సీన్స్.. బెబ్బమ్మ కోసం ఆశీ ప్రయత్నాలు
Uppena

Updated on: Mar 31, 2021 | 8:44 PM

Uppena: అందమైన ప్రేమ కథతో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా ఉప్పెన. మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ ఇది. ఈ సినిమాలో బెంగుళూరు బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్ గా నటించింది. టాప్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. మంచి హిట్ అందుకోవడమే కాకుండా భారీగా వసూళ్లను కూడా రాబట్టింది.  ఒక డెబ్యూ హీరో సినిమాకు ఈ రేంజ్ వసూళ్లు రావడంతో టాలీవుడ్ మొత్తం షాక్ అయ్యింది. మైత్రీ మూవీ మేకర్స్ – సుకుమార్ రైటింగ్స్ కలసి నిర్మించిన ఈ చిత్రం వంద కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

ఇక ఈ సినిమాలో చక్కటి ప్రేమకథతోపాటు అందమైన పాటలుకూడా అలరించాయి. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాను మరో మెట్టు పైకెక్కించింది. ముఖ్యంగా నీకన్ను నీలి సముద్రం అనే పాట యువతను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే జలజల జలపాతం అంటూ సాగే పాటకూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. తాజాగా ఈ సినిమానుంచి డిలీట్ చేసిన సన్నివేశాలను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ సీన్స్ యూట్యూబ్ లో హల్ చల్ చేస్తున్నాయి. హీరో వైష్ణవ్ తన బస్తీలోని ఒక అమ్మాయిని ఒప్పించి బేబమ్మకు లవ్ లెటర్ ఇప్పించే సన్నివేశం అభిమానులను ఆకట్టుకుంటోంది. బేబమ్మకు లవ్ లెటర్ ఇచ్చేందుకు ఆశీ పడే ప్రయత్నాలు ఈ వీడియోలో చూడొచ్చు. అంతే కాకుండా ఈ వీడియోలో వచ్చే గోదావరి జిల్లా జానపద గీతం కూడా అలరిస్తోంది.

 మరిన్ని ఇక్కడ చదవండి : 

Sulthan Pre Release Event LIVE : సుల్తాన్‌‌‌‌గా రానున్న కార్తి.. ఘనంగా ప్రీరిలీజ్ ఈవెంట్..

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు సాయంతో మరో చిన్నారి గుండె పదిలం..

Acharya movie : ఆచార్య నుంచి మొదటి సాంగ్ వచ్చేసింది.. మరోసారి స్టెప్పులతో అదరగొట్టిన మెగాస్టార్