Krithi Shetty: ఉప్పెన భామ జోరు మాములుగా లేదుగా.. బుల్లి తెర ప్రకటన కోసం భారీ రెమ్యునరేషన్‌ తీసుకున్న కృతి.

Krithi Shetty: ఒకే ఒక సినిమాతో ఎక్కడ లేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది అందాల భామ కృతి శెట్టి. ఉప్పెన చిత్రంలో తనదైన అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ చిన్నది...

Krithi Shetty: ఉప్పెన భామ జోరు మాములుగా లేదుగా.. బుల్లి తెర ప్రకటన కోసం భారీ రెమ్యునరేషన్‌ తీసుకున్న కృతి.
Kriti Shetty

Updated on: Jul 28, 2021 | 11:13 AM

Krithi Shetty: ఒకే ఒక సినిమాతో ఎక్కడ లేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది అందాల భామ కృతి శెట్టి. ఉప్పెన చిత్రంలో తనదైన అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ చిన్నది కుర్రకారు మతులు పొగొట్టింది. ఇక ఈ సినిమా ఇచ్చిన భారీ సక్సెస్‌తో ఈ అమ్మడు టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌లలో ఒకరిగా మారింది. కృతికి దర్శక, నిర్మాతల నుంచి వరుస ఆఫర్లు దక్కుతున్నాయి. అతి తక్కువ సమయంలో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న ఈ చిన్నది ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో దూసుకుపోతోంది.

ఇదిలా ఉంటే కృతికి ఉన్న క్రేజ్‌ను కేవలం సినిమా వాళ్లే కాకుండా బుల్లి తెర కూడా ఉపయోగించుకునే పనిలో పడింది. ఈ క్రమంలోనే తాజాగా తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్‌ చానల్‌ జీ తెలుగు తమ ప్రోగ్రామ్స్‌ ప్రమోట్‌ కోసం కృతిని తీసుకుంది. ఇందులో భాగంగానే జీ తెలుగుకు సంబంధించిన సీరియళ్ల ప్రమోషన్‌లో కృతిని భాగస్వామిని చేశారు. ఈ ప్రకటన కోసం కృతి ఏకంగా రూ. కోటి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజందో ఉందో తెలియదు కానీ.. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అత్యంత తక్కువ సమయంలోనే ప్రకటనకు రూ. కోటి రెమ్యూనరేషన్‌ తీసుకున్న నటిగా కృతి రికార్డుల్లోకి ఎక్కినట్లే. ఇక కృతి కెరీర్‌ విషయానికొస్తే నాని హీరోగా తెరకెక్కుతోన్న ‘శ్యామ్‌ సింగరాయ్‌’, రామ్‌ పోతినేని హీరోగా వస్తోన్న సినిమాతో పాటు, సుధీర్‌ బాబు హీరోగా తెరకెక్కుతోన్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాల్సిందే’ లాంటి సినిమాల్లో నటిస్తోంది. ఒక్క సినిమాతో ఇంత క్రేజ్‌ సంపాదించుకున్న కృతి.. ఈ సినిమాల విడుదల తర్వాత ఏ స్థాయికి వెళుతుందో చూడాలి.

Also Read: Narappa: దూసుకుపోతున్న నారప్ప.. అమెజాన్ మూవీస్‌ లిస్ట్‌లో టాప్‌లో ట్రెండ్

Samantha: రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలో అక్కినేని సమంత.. అభిమానులకు పండగే..

MAA Elections: రోజుకో ట్విస్ట్‌తో ‘మా’ ఎన్నికలు.. రేపు కృష్ణంరాజు అధ్యక్షతన సమావేశం.. ఏకగ్రీవం కోసం మురళీ మోహన్

 

Loading...
Unable to load recommendations.
Follow Us