Upasana : అలాంటి భార్య దొరకడం ఆ హీరో లక్.. నాకన్నా చిన్నదైనా ఆమె చాలా స్ట్రాంగ్

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల భార్యల గురించి, అలాగే పలువురు ప్రముఖులతో తనకున్న అనుబంధంపై ఉపాసన కొణిదెల ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇండస్ట్రీలో తనకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారని, స్టార్ హీరోల భార్యతో తనకున్న అనుబంధాన్ని ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

Upasana : అలాంటి భార్య దొరకడం ఆ హీరో లక్.. నాకన్నా చిన్నదైనా ఆమె చాలా స్ట్రాంగ్
Upasana

Updated on: Oct 28, 2026 | 8:41 AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఉపాసన ఓ ఇంటర్వ్యూలో సమంత, నమ్రత శిరోద్కర్, జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి వంటి పలువురు ప్రముఖులతో తనకున్న అనుబంధంపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఉపాసన తన వ్యక్తిగత జీవితం, సినీ పరిశ్రమతో తన అనుభవాలపై స్పందించారు. ముందుగా సమంత గురించి మాట్లాడుతూ, “నేను ఆమె నుండి నిత్యం నేర్చుకుంటూనే ఉంటాను. ఆమె నన్ను ఎంతగానో స్ఫూర్తినిస్తుంది” అని ఉపాసన పేర్కొన్నారు. సమంత కంటెంట్, వ్యక్తిత్వం తనను ప్రభావితం చేస్తాయని, ఆమె ఇచ్చే కృషి, నిబద్ధత అద్భుతమని కొనియాడారు. సమంత నుంచి తాను నిజంగానే నేర్చుకుంటున్నానని, ఆమెను ప్రశంసించడానికి ఎటువంటి సందేహం లేదని స్పష్టం చేశారు. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గురించి ప్రస్తావించినప్పుడు, “సానియా నా బెస్ట్ ఫ్రెండ్. ఆమె అంటే నాకు ఎంతో ఇష్టం. ఆమె నెక్స్ట్ లెవల్ వ్యక్తి” అని ఉపాసన ఆనందంగా చెప్పారు. అలాగే మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ గురించి ఉపాసన మాట్లాడుతూ..

చిత్ర పరిశ్రమకు సంబంధించిన అనేక విషయాలను తాను నమ్రత నుంచి నేర్చుకున్నానని వెల్లడించారు. “ఈ సినీ పరిశ్రమ గురించి నాకు పెద్దగా తెలియదు. నిర్మాతలు అంటే ఎవరు, దర్శకులు ఏం చేస్తారు వంటి విషయాలు నాకు తెలియవు” అని ఉపాసన అన్నారు. చరణ్, తాను తమ పరిమితులను పాటిస్తామని, అయితే నమ్రత తనకు ఈ విషయాలపై అవగాహన కల్పించారని తెలిపారు. ఒకసారి ఇద్దరూ కలిసి సెలవులకు వెళ్లినప్పుడు నమ్రత తనకు ఎన్నో విషయాలు వివరించారని గుర్తు చేసుకున్నారు. నమ్రత కూడా ఒక నటి కావడం వల్ల ఆమెతో సమయం గడపడం తనకు ఎంతో సంతోషాన్నిస్తుందని ఉపాసన చెప్పారు. అలాగే, నమ్రత కుమార్తె సితార పుట్టినరోజు, ఉపాసన పుట్టినరోజు ఒకే రోజు కావడంతో సితారతో తనకు చాలా ప్రత్యేకమైన బంధం ఉందని తెలిపారు.

ఇక  జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి గురించి ఉపాసన కొణిదెల ఎంతో అభిమానంతో మాట్లాడారు. “నేను లేనప్పుడు కూడా నా ఇంటిని ప్రణతి చక్కగా చూసుకుంటుంది. ఆమె చాలా మంచిది” అని ఉపాసన ప్రశంసించారు. ప్రణతిని చూసినప్పుడు, “అన్నింటినీ చూసుకోగల అద్భుతమైన అమ్మాయి ఆమె” అనిపిస్తుందని అన్నారు. “ఆమె చాలా బలమైనది. నాకంటే చిన్నదైనా, ప్రణతి చాలా స్ట్రాంగ్” అని ఉపాసన చెప్పారు. ప్రణతిని చూడగానే ప్రశాంతంగా అనిపిస్తుందని, జూనియర్ ఎన్టీఆర్ ఆమెను భార్యగా పొందడం చాలా అదృష్టమని ఉపాసన అన్నారు. అలాగే ఇంటర్వ్యూలో ఒక సందర్భంలో, తెలుగులో రెండు మాటలు చెప్పమని కోరగా, ఉపాసన దానికి సున్నితంగా నిరాకరించారు. తాను హైదరాబాద్‌లో పుట్టి పెరిగినప్పటికీ, హిందీ, తమిళం, తెలుగు, ఉర్దూ వంటి అన్ని భాషలు తనకు తెలుసని, కానీ ఒత్తిడిలో మాట్లాడనని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us