
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఈ శుక్రవారం (అక్టోబర్ 30) న ప్రేక్షకుల ముందుకు రానుంది.
కాగా ఈ ఆదర్శ కుటుంబంలో వెంకటేశ్ సరసన కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. అలాగే నారా రోహిత్, నివేదా పెతురాజ్, యువీనా, రాజ్ ప్రజ్వల్, రావు రమేశ్, సత్య, బ్రహ్మాజీ, ఉదయ్భీర్ సంధూ, వెన్నెల కిశోర్, రఘుబాబు తదితరులు కీలకపాత్రలు పోషించారు. కాగా ఈ సినిమాలో వెంకటేష్ కుమారుడిగా ఛైల్డ్ ఆర్టిస్ట్ రాజ్ ప్రజ్వల్ నటించాడు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ బుడ్డోడి పేరే వినిపిస్తోంది. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ బుడ్డోడి స్పీచ్ వీడియోలే దర్శనమిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం మల్లారెడ్డి కాలేజీలో నిర్వహించిన ఆదర్శ కుటుంబం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ప్రజ్వల్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు.. ‘పాలమ్మినా.. పూలమ్మినా’ అంటూ ఏకంగా మల్లారెడ్డినే ఇమిటేట్ చేశాడీ బుడ్డోడు. ఇక ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ మరోసారి తన స్పీచ్తో అదరగొట్టేశాడు ప్రజ్వల్. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదలుకొని హీరో వెంకటేష్, హీరోయిన్ శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్, బ్రహ్మాజీ, తమన్, ఆఖరికి యాంకర్ సుమ పై కూడా తన యాస , ప్రాసలతో మాట్లాడి ఈ ఈవెంట్ కే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడీ బుడ్డోడు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో రాజా ప్రజ్వల్ పేరు మార్మోగుతుంది? దీంతో ఈ పిల్లాడెవరు? అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అంటూ నెటిజెన్స్ ఆరా తీయగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాజా ప్రజ్వల్ జీ తెలుగు ఛానల్ లో ప్రసారమైన డ్రామా జూనియర్స్ సీజన్ 5 విజేతగా నిలిచాడు. అంతేకాదు ఇదే షోలో ‘జూనియర్ బాలయ్య’గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక 35 చిన్న కథ కాదు అనే సినిమాలో క్లాస్ మానిటర్ పాత్ర పోషించాడు రాజా ప్రజ్వల్. ఆ తర్వాత పడమటి సంధ్యారాగం చిత్రంలో బిట్టు పాత్రతో బాగా ఫేమస్ అయ్యాడు. డ్రింకర్ సాయి, సరిపోదా శనివారం, లిటిల్ హార్ట్స్ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు ప్రజ్వల్. ఇ ప్పుడు ఆదర్శ కుటుంబం చిత్రంతో మరోసారి మన ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాలో వెంకటేష్ కుమారుడు సర్వ అనే పాత్రలో నటిస్తున్నాడు ప్రజ్వల్. అక్టోబర్ 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.