
గతేడాది భైరవం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు మంచు మనోజ్. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా ఆ తర్వాత వచ్చిన మిరాయ్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడీ రాక్ స్టార్. ఈ సినిమా ఏకంగా రూ. 300 కోట్ల మేర కలెక్షన్లు సాధించింది. ఇప్పుడీ విజయ పరంపరను కొనసాగిస్తూ డేవిడ్ రెడ్డిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు మనోజ్. హనుమరెడ్డి యక్కంటి ఈ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ కు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్, టీజర్ మనోజ్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ పాన్ ఇండియాకు సంబంధించిన మరో కీలక అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలో మనోజ్ సరసన నటించే హీరోయిన్ ను పరిచయం చేస్తూ, ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేశారు. ‘డేవిడ్ రెడ్డి’ సినిమాలో మరియా ర్యాబోషప్కా హీరోయిన్‌గా నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. క్లారా విట్మోర్ అనే పాత్రలో కనిపించనున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. ‘ఆమె ప్రేమ ఓ యుద్ధం’ అంటూ విడుదల చేసిన మరియా ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఇందులో ఆమె బ్రిటీష్ గర్ల్ గెటప్ లో కనిపించింది. ఇక మరియాకు స్వాగతం పలుకుతూ హీరో మంచు మనోజ్ కూడా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. డేవిడ్ రెడ్డి అనే ఇంటెన్స్ వరల్డ్ లీడింగ్ లేడీ మరియాకి స్వాగతం పలుకుతోందని మంచు మనోజ్ ట్వీట్ చేశాడు.
కాగా ఉక్రెయిన్ సినిమాలతోనే నటిగా మారిన మరియా.. ‘స్పెషల్ OPS 1.5’ అనే వెబ్‌సిరీస్‌తో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అలాగే ‘ప్రిన్స్’ సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను కూడా పలకరించింది. అనుదీప్ కేవీ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో మరియా హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు ‘డేవిడ్ రెడ్డి’ సినిమాతో మరోసారి తెలుగు ఆడియెన్స్ ను పలకరించేందుకు రెడీ అయిపోయిందీ అందాల తార.
బ్రిటీష్ ఇండియా బ్యాక్ డ్రాప్ లో స్వాతంత్ర్యానికి పూర్వం 1897 – 1922 మధ్య కాలంలో జరిగే కథతో డేవిడ్ రెడ్డి సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఫారెన్ బ్యాక్ డ్రాప్ ఉండటంతో మరియాను హీరోయిన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం కొన్ని రోజుల క్రితమే ఆమె ఇండియాకి వచ్చింది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
The intense world of #DavidReddy welcomes its leading lady, Maria Riabhoshapka as Clara Whitmore.
Her love is War. 🔥
@RiaBhoshapkaM pic.twitter.com/So0WmhpBSb
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 6, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.